Telugu Global
Cinema & Entertainment

సౌత్ సినిమాలంటే బాలీవుడ్ మేకర్స్ కి వణుకు.. స్టార్ యాక్టర్ కామెంట్స్..!

పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్- 2 ఇటీవల హిందీలో విడుదలై సంచలన విజయాలు సాధించిన సినిమాలు ఇవి. ఈ సినిమాలకు వందల కోట్ల కలెక్షన్స్ మాత్రమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలై రూ.వంద కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ -2 సినిమాలకు విడుదలకు ముందే బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకోవడంలో అవి సక్సెస్ […]

సౌత్ సినిమాలంటే బాలీవుడ్ మేకర్స్ కి వణుకు.. స్టార్ యాక్టర్ కామెంట్స్..!
X

పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్- 2 ఇటీవల హిందీలో విడుదలై సంచలన విజయాలు సాధించిన సినిమాలు ఇవి. ఈ సినిమాలకు వందల కోట్ల కలెక్షన్స్ మాత్రమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఎటువంటి అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలై రూ.వంద కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ -2 సినిమాలకు విడుదలకు ముందే బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకోవడంలో అవి సక్సెస్ అయ్యాయి. రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించాయి.

కాగా హిందీలో సౌత్ సినిమాల విజయంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ నుంచి వచ్చిన పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాలీవుడ్ దర్శక నిర్మాతలకు వణుకు పుట్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించాడు. హిందీలో సౌత్ సినిమాల విజయం పై మనోజ్ బాజ్ పాయ్ ఢిల్లీ టైమ్స్ తో మాట్లాడారు.

‘ఇటీవల సౌత్ నుంచి వచ్చి హిందీలో విడుదలైన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ సినిమాలను చూసి హిందీ ఫిలిం మేకర్స్ భయపడుతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్లకు ఏం చేయాలో తోచడం లేదు. ఇది ఒక రకంగా బాలీవుడ్ కు గుణపాఠం వంటిది. ఈ సినిమాలను చూసి బాలీవుడ్ మేకర్స్ ఎంతోకొంత నేర్చుకోవాలి.

సౌత్ సినిమాలు తీసే వాళ్ళు ఎంతో ఇష్టంతో సినిమాలు తీస్తారు. వారు తీసే ప్రతీ సన్నివేశం కూడా ప్రపంచంలోనే బెస్ట్ గా ఉండాలనే తపనతో తీస్తారు. పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు చూస్తే ప్రతి సన్నివేశాన్ని ఎంతో నిబద్ధతతో తీసినట్లు అర్థమవుతుంది. ఈ నిబద్ధత హిందీలో లేదు. బాలీవుడ్ లో ఎప్పుడూ కలెక్షన్ల గురించి ఆలోచించడమే తప్ప ఆత్మ విమర్శ అనేది లేదు.

అదే సౌత్, హిందీ సినిమాలకు మధ్య తేడా. సౌత్ సినిమాలను చూసి హిందీ మేకర్స్ మెల‌కువలు నేర్చుకోవాలి.’ అని మనోజ్ బాజ్ పాయ్ కామెంట్స్ చేశారు. సౌత్, హిందీ సినిమాల పట్ల మధ్య తేడాపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

First Published:  29 April 2022 6:13 AM IST
Next Story