Telugu Global
National

గాడిద పాలతో సబ్బులు.. కేరళలో ఇప్పుడివే ఫేమస్..

కేరళ పేరు చెప్పగానే అందమైన పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత అక్కడ కొబ్బరినూనెతో చేసే వెరైటీ వంటకాలు. ఇలా రకరకాలుగా కేరళ ఫేమస్. ఇప్పుడు కేరళ గాడిద పాలతో చేసే సబ్బులతో కూడా ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది. కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేరళ మెగా ఎగ్జిబిషన్లో గాడిదపాలతో చేసిన సబ్బుల్ని కొత్తగా మార్కెటింగ్ చేస్తున్నారు. ‘బేమోస్ బే’ పేరుతో ఈ గాడిదపాల సబ్బుల్ని చేతితో తయారు చేయిస్తున్నారు.. మహిళా పారిశ్రామికవేత్త సరి చంగరంకుమరత్. కేరళ ఖాదీబోర్డ్ […]

గాడిద పాలతో సబ్బులు.. కేరళలో ఇప్పుడివే ఫేమస్..
X

కేరళ పేరు చెప్పగానే అందమైన పర్యాటక ప్రాంతాలు గుర్తొస్తాయి. ఆ తర్వాత అక్కడ కొబ్బరినూనెతో చేసే వెరైటీ వంటకాలు. ఇలా రకరకాలుగా కేరళ ఫేమస్. ఇప్పుడు కేరళ గాడిద పాలతో చేసే సబ్బులతో కూడా ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది. కేరళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కేరళ మెగా ఎగ్జిబిషన్లో గాడిదపాలతో చేసిన సబ్బుల్ని కొత్తగా మార్కెటింగ్ చేస్తున్నారు. ‘బేమోస్ బే’ పేరుతో ఈ గాడిదపాల సబ్బుల్ని చేతితో తయారు చేయిస్తున్నారు.. మహిళా పారిశ్రామికవేత్త సరి చంగరంకుమరత్. కేరళ ఖాదీబోర్డ్ ద్వారా ఈ సబ్బుల్ని మార్కెట్లోకి ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం ఎగ్జిబిషన్లలో మాత్రమే వీటిని అమ్మకానికి ఉంచుతున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో మార్కెటింగ్ చేయబోతున్నారు.

గాడిదపాలు ఎంత శ్రేష్టం..
క్లియోపాత్రా అందానికి గాడిదపాలు కారణం అని కథనాలున్నాయి. ఆమె గాడిదపాలతో స్నాహం చేసేవారని చెబుతారు. గాడిదపాలలో చర్మ సమస్యలను రూపుమాపే గుణాలున్నాయని పలు అధ్యయనాలు కూడా రుజువు చేస్తున్నాయి. గాడిదపాలలో విటమిన్ ఎ, బి-1, బి-6, సి, ఒమెగా ఫాటీ ఆమ్లాలు కూడా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు, చర్మ సమస్యలు ఉన్నవారికి గాడిదపాలు బాగా పనిచేస్తాయని అంటారు. గాడిదపాలు తాగడంతోపాటు, చర్మంపై రాసుకున్నా కూడా సమస్యలు దూరమవుతాయి. అందుకే గాడిదపాలతో సబ్బులు తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నామని చెబుతున్నారు చంగరంకుమరత్. లాక్ డౌన్ సమయంలో తన కూతురికోసం గాడిద పాలతో సబ్బు తయారు చేశానని, ఆ తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మకానికి ఉంచానని చెబుతున్నారామె.

తమిళనాడు ఫేమస్..
గాడిద పాలకు తమిళనాడు ఫేమస్. అక్కడినుంచే ప్రస్తుతం కేరళకు గాడిద పాలు దిగుమతి చేసుకుంటున్నారు. లీటర్ పాల ధర 7వేల రూపాయలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరముపాలు.. అంటూ వేమన చెప్పిన పద్యం.. ఈ కాలంలో గాడిద పాల రేటుముందు వెలవెలబోతోందనే చెప్పాలి. ఇప్పటి వరకూ సబ్బుల పేరు చెబితే కర్నాటక శాండిల్ సోప్ లు గుర్తొచ్చేవి. ఇకపై కేరళ గాడిద పాలతో చేసిన ‘బేమోస్ బే’ సబ్బులు కూడా ఆ లిస్ట్ లో చేరబోతున్నాయి.

First Published:  28 April 2022 8:39 AM IST
Next Story