Telugu Global
Family

అన్ని చోట్లా డిజిటల్ పేమెంట్స్.. అక్కడ మాత్రం నిరాశే..

డిజిటల్ పేమెంట్స్, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. ఆఖరుకి బిచ్చగాళ్లు కూడా చిల్లర డబ్బుల్ని పేటీఎం చేయాలని అడుగుతున్న రోజులివి. పర్స్ లేకపోయినా పర్లేదు, జేబులో ఫోన్ ఉంటే చాలు ఎక్కడ, ఎవరికి డబ్బులు కావాలన్నా వెంటనే బదిలీ చేయొచ్చు. కానీ దేవాలయాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ ఇంకా జోరందుకోలేదు. హుండీలో వేసే కానుకుల బదులు నేరుగా దేవస్థానం బోర్డ్ కి నగదు బదిలీ చేయాలంటూ కొన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ […]

అన్ని చోట్లా డిజిటల్ పేమెంట్స్.. అక్కడ మాత్రం నిరాశే..
X

డిజిటల్ పేమెంట్స్, క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. ఆఖరుకి బిచ్చగాళ్లు కూడా చిల్లర డబ్బుల్ని పేటీఎం చేయాలని అడుగుతున్న రోజులివి. పర్స్ లేకపోయినా పర్లేదు, జేబులో ఫోన్ ఉంటే చాలు ఎక్కడ, ఎవరికి డబ్బులు కావాలన్నా వెంటనే బదిలీ చేయొచ్చు. కానీ దేవాలయాల్లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ ఇంకా జోరందుకోలేదు. హుండీలో వేసే కానుకుల బదులు నేరుగా దేవస్థానం బోర్డ్ కి నగదు బదిలీ చేయాలంటూ కొన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ తో ఉన్న స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఏపీలో ఈ ట్రెండ్ మొదలైనట్టు చెప్పలేం కానీ, కేరళలోని కొచ్చిలోని కొన్ని ప్రముఖ ఆలయాల్లో కూడా హుండీలపై క్యూఆర్ కోడ్ అంటించిన స్టిక్కర్లు కనపడుతున్నాయి. ఎడప్పల్లిలోని శ్రీ మహాగణపతి ఆలయంలో మూడు హుండీలపై ఇలాంటి స్టిక్కర్లు ఉంచారు. కొచ్చి దేవస్థానం బోర్డ్ కూడా ప్రయోగాత్మకంగా తమ అధీనంలోని ఆలయాల్లో డిజిటల్ పేమెంట్స్ ని ప్రోత్సహిస్తోంది.

ఫలితాలెలా ఉన్నాయి..?
అయితే అన్నిచోట్లా డిజిటల్ పేమెంట్స్ కి ఆదరణ ఉందేమో కానీ, ఆలయాల్లో మాత్రం ఆ స్థాయి ఆదరణ లేనట్టు తెలుస్తోంది. కొచ్చిలోని ఆలయాల్లో కూడా భక్తులు నేరుగా స్వామివారికి కానుకలు సమర్పించేందుకే ఉత్సాహం చూపిస్తున్నారు. ఆలయాల్లో భక్తులు పూజారి హారతి పళ్లెంలోనే కానుకలు ఉంచుతారు, ఇంకొందరు హుండీలో వేస్తారు. హుండీలో కానుకలు వేయడం కంటే.. పూజారి పళ్లెంలోనే దక్షిణ ఉంచడం ఎక్కువమందికి అలవాటు. ఈ అలవాటుతో.. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ వైపు కూడా వారు దృష్టిసారించడంలేదు.

భక్తులకు అలవాటవుతుందా..?
సాధారణంగా ఆలయాలకు వచ్చేవారిలో వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉంటారు. వారిలో ఎక్కువమంది ఇంకా డిజిటల్ పేమెంట్స్ అలవాటు చేసుకోలేదు. అందుకే ఆలయాల్లో ఉన్న క్యూఆర్ కోడ్ లకు పెద్దగా పనిపడటం లేదని అంటున్నారు కొచ్చి దేవస్థానం బోర్డ్ అధ్యక్షుడు నందకుమార్.

మరికొన్ని ప్రాంతాల్లో ఆలయాల్లోకి వెళ్లేముందు సెల్ ఫోన్లను బయటే భద్రపరిచే నిబంధనలున్నాయి. నేరుగా ఇంటినుంచి వచ్చేవారు ఆలయానికి ఫోన్ తేవడానికి అంతగా ఇష్టపడరు. మొబైల్ ఫోన్ తమ ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని అంటుంటారు. అంటే, గుడిలో ఫోన్ అందుబాటులో ఉంచుకోరు కాబట్టి.. డిజిటల్ పేమెంట్స్ కి అవకాశం ఉండదు అంటున్నారు. మొత్తానికి కొచ్చిలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతి అమలులోకి తెచ్చినా డిజిటల్ పేమెంట్స్ పెద్దగా సాధ్యపడటంలేదు. భక్తులు తమ స్వహస్తాలతో డబ్బు హుండీలో వేయడం, హారతి పళ్లెంలో ఉంచడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని తేలుతోంది.

First Published:  28 April 2022 3:27 AM GMT
Next Story