మానవులకు కూడా బర్డ్ ఫ్లూ.. చైనాలో తొలి కేసు..
బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఇప్పటి వరకూ పక్షుల్లో మాత్రమే కనిపించేది. బర్డ్ ఫ్లూ వైరస్ సోకగానే పక్షులు వాటంతట అవే చనిపోయేవి. అనుమానంతో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షుల్ని ప్రభుత్వ సిబ్బంది చంపేసి సామూహికంగా పూడ్చి వేసేవారు. భారత్ లో కూడా గతంలో పలు ప్రాంతాల్లో కోళ్లఫారంలలో ఇలా బర్డ్ ఫ్లూ అనుమానంతో పక్షుల్ని సామూహికంగా పూడ్చేశారు. అయితే తొలిసారి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మనుషుల్లో కూడా ప్రవేశించింది. అది కూడా […]
బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఇప్పటి వరకూ పక్షుల్లో మాత్రమే కనిపించేది. బర్డ్ ఫ్లూ వైరస్ సోకగానే పక్షులు వాటంతట అవే చనిపోయేవి. అనుమానంతో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షుల్ని ప్రభుత్వ సిబ్బంది చంపేసి సామూహికంగా పూడ్చి వేసేవారు. భారత్ లో కూడా గతంలో పలు ప్రాంతాల్లో కోళ్లఫారంలలో ఇలా బర్డ్ ఫ్లూ అనుమానంతో పక్షుల్ని సామూహికంగా పూడ్చేశారు. అయితే తొలిసారి ఈ బర్డ్ ఫ్లూ వైరస్ మనుషుల్లో కూడా ప్రవేశించింది. అది కూడా కొవిడ్ వ్యాప్తికి కారణం అని చెబుతున్న చైనాలోనే కావడం విశేషం. హెనన్ ప్రావిన్స్ లో నాలుగేళ్ల బాలుడి శరీరంలో బర్డ్ ఫ్లూ వైరస్ జాడ కనిపించిందని చైనా ధృవీకరించింది. H3N8 రకం బర్డ్ ఫ్లూ వైరస్ గా దీన్ని నిర్థారించారు. అయితే ఇది మానవుల్లో వ్యాపించేందుకు అవకాశాలు తక్కువ ఉన్నాయని చెబుతున్నారు.
ఎలా వచ్చింది..?
హెనన్ ప్రావిన్స్ లో ఉన్న ఓ కుటుంబం కాకుల్ని, కోళ్లను పెంచుకుంటోంది. వాటితో సన్నిహితంగా ఉండటం వల్లే వాటినుంచి ఆ పిల్లవాడికి బర్డ్ ఫ్లూ వ్యాపించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. జ్వరంతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు మొదలు కావడంతో అతడికి వైద్య పరీక్షలు చేశారు. చివరకు బర్డ్ ఫ్లూ గా నిర్థారించారు. బర్డ్ ఫ్లూ మొట్టమొదటి సారిగా మానవ శరీరంలో కనిపించడం ఇదే తొలిసారి అని చైనా జాతీయ హెల్త్ కమిషన్ తేల్చింది.
గుర్రాలు, కుక్కలు, సీల్స్ వంటి జంతువుల్లో కూడా H3N8 వైరస్ జాడ సహజంగా కనిపిస్తుందని అంటున్నారు అక్కడి శాస్త్రవేత్తలు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా హెనన్ కి చెందిన బాలుడిలో ఉన్న వైరస్ ని H3N8గా నిర్థారించామని అంటున్నారు. సహజంగా పౌల్ట్రీల్లో కూడా ఈ వైరస్ జాడ కనిపించేదని, మనుషులకు వ్యాపించిన ఉదాహరణలు ఇప్పటి వరకూ లేవని, హెనన్ బాలుడి కేసు మొట్టమొదటిది అని చెబుతున్నారు.