Telugu Global
National

విద్వేష రాజకీయాలు ఇక చాలు " ప్రధానికి 108మంది మాజీ అధికారుల లేఖ..

వారంతా మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తమ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకుని దేశ పురోభివృద్ధికి తోడ్పడిన మేధావులు. అలాంటివారంతా ప్రస్తుత భారత దేశ పరిస్థితిపై తీవ్ర ఆందోళన, విచారం వ్యక్తం చేస్తున్నారు. భారత్ మునుపెన్నడూ లేనంత సైనిక ఆయుధ సంపత్తని పెంచుకుందని, ఆర్థికంగా ఎదుగుతోందని, మేకిన్ ఇండియా ఉత్పత్తులతో దూసుకుపోతోందని, అంతా డిజిటలైజేషన్ అయిపోయిందని.. కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ విద్వేష రాజకీయాలు భారత్ ని పాతాళానికి తీసుకెళ్లే ప్రమాదం […]

విద్వేష రాజకీయాలు ఇక చాలు  ప్రధానికి 108మంది మాజీ అధికారుల లేఖ..
X

వారంతా మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు. తమ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకుని దేశ పురోభివృద్ధికి తోడ్పడిన మేధావులు. అలాంటివారంతా ప్రస్తుత భారత దేశ పరిస్థితిపై తీవ్ర ఆందోళన, విచారం వ్యక్తం చేస్తున్నారు. భారత్ మునుపెన్నడూ లేనంత సైనిక ఆయుధ సంపత్తని పెంచుకుందని, ఆర్థికంగా ఎదుగుతోందని, మేకిన్ ఇండియా ఉత్పత్తులతో దూసుకుపోతోందని, అంతా డిజిటలైజేషన్ అయిపోయిందని.. కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ విద్వేష రాజకీయాలు భారత్ ని పాతాళానికి తీసుకెళ్లే ప్రమాదం ఉందని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి 108మంది మాజీ అధికారులు ఓ లేఖ రాశారు. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న విద్వేష విధ్వంసకాండ.. కేవలం మైనార్టీ వర్గాలనే కాదు, భారత రాజ్యాంగాన్ని కూడా బలిపీఠంపై పెట్టిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, జాతీయ రక్షణశాఖ మాజీ సలహాదారు శంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోంశాఖ సెక్రటరీ జీకే పిళ్లై వంటివారు ఈ లేఖ రాసినవారిలో ఉన్నారు. మొత్తం 108మంది మాజీ అధికారులు మోదీకి మేలుకొలుపులా ఈ లేఖ రాశారు. భారత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ అధికారులుగా ఇంత తీవ్ర స్థాయిలో దేశంలోని పరిస్థితుల్ని వర్ణించడం ఇష్టం లేకపోయినా.. విద్వేష విధ్వంసం పతాక స్థాయికి చేరుకోవడంతో తప్ప లేదని చెప్పారు. అసోం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, ఎంపీ, యూపీ, ఉత్తరాఖండ్ సహా ఇతర రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలుగా మైనార్టీ వర్గాలపై, ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరిగిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస పెచ్చుమీరుతోందని గుర్తు చేశారు.

భారత దేశ నాగరిక, వారసత్వానికి మచ్చతెచ్చేలే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఉదాహరణగా చెప్పొచ్చని అంటున్నారు మాజీ అధికారులు. సామాజిక కోణంలో దేశంలో ప్రజల మధ్య విభజన జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో ఈఏడాది ఉత్సవాలు జరుపుకుంటున్నామని, ఈ ఉత్సవాలతో అయినా విద్వేష రాజకీయాలకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదం నిజమవ్వాలంటే.. మీరు మౌనం వీడాలని, విద్వేష రాజకీయాలు చేస్తున్నవారికి అడ్డుకట్ట వేయాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

First Published:  27 April 2022 1:53 PM IST
Next Story