Telugu Global
Cinema & Entertainment

శబరిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్

నాంది, క్రాక్ సినిమాల తర్వాత తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇమేజ్, క్రేజ్ రెండూ పెరిగాయి. దీంతో ఆమెను సినిమాల్లోకి తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది మేకర్స్ మరో అడుగు ముందుకేసి, వరలక్ష్మితో ఏకంగా ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్టులతో సినిమాలు తీస్తున్నారు. ఇందులో భాగంగా వరలక్ష్మి అంగీకరించిన మరో ప్రాజెక్టు శబరి. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా […]

శబరిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్
X

నాంది, క్రాక్ సినిమాల తర్వాత తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కు ఇమేజ్, క్రేజ్ రెండూ పెరిగాయి. దీంతో ఆమెను సినిమాల్లోకి తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరికొంతమంది మేకర్స్ మరో అడుగు ముందుకేసి, వరలక్ష్మితో ఏకంగా ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్టులతో సినిమాలు తీస్తున్నారు. ఇందులో భాగంగా వరలక్ష్మి అంగీకరించిన మరో ప్రాజెక్టు శబరి.

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రాబోతోంది శబరి. సీనియర్ దర్శకుడు బి.గోపాల్, గౌరవ దర్శకత్వంలో మొదలైన ఈ ప్రాజెక్టులో, టాలీవుడ్-కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు.

క్రైమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గోపీసుందర్ సంగీతం అందించబోతున్నారు.

ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. హైదరాబాద్, విశాఖ, కొడైకెనాల్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేయబోతున్నారు. అటుఇటుగా 3 నెలల్లో ఈ సినిమా టోటల్ వర్క్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. వరలక్ష్మి కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రంగా ఇది రాబోతోంది.

First Published:  5 April 2022 2:50 AM IST
Next Story