వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శ్రీలీల
ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే, అది ఫ్లాప్ కిందే లెక్క. హీరో, హీరోయిన్, డైరక్టర్.. ఇలా ఎవ్వరికీ పేరు-గుర్తింపు రాదు. కానీ అడుగుపెట్టడంతోనే సంచలనం సృష్టించింది శ్రీలీల. ఫ్లాప్ సినిమా చేసి కూడా అటు ప్రేక్షకుల్ని, ఇటు ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేసింది. పెళ్లిసందడి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ, తన అందచందాలతో బి, సి-సెంటర్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. ఆ అందాలే ఆమెకు ఇప్పుడు వరుసపెట్టి ఆఫర్లు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ సరసన ఓ సినిమాలో నటిస్తోంది […]
ఓ సినిమా ఫ్లాప్ అయిందంటే, అది ఫ్లాప్ కిందే లెక్క. హీరో, హీరోయిన్, డైరక్టర్.. ఇలా ఎవ్వరికీ పేరు-గుర్తింపు రాదు. కానీ అడుగుపెట్టడంతోనే సంచలనం సృష్టించింది శ్రీలీల. ఫ్లాప్ సినిమా చేసి కూడా అటు ప్రేక్షకుల్ని, ఇటు ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేసింది. పెళ్లిసందడి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ, తన అందచందాలతో బి, సి-సెంటర్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. ఆ అందాలే ఆమెకు ఇప్పుడు వరుసపెట్టి ఆఫర్లు తెచ్చిపెడుతున్నాయి.
ప్రస్తుతం రవితేజ సరసన ఓ సినిమాలో నటిస్తోంది శ్రీలీల. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధమాకా అనే పేరు పెట్టారు. తాజాగా నితిన్ సినిమాలో కూడా నటించే అవకాశం అందుకుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ చేయబోయే కొత్త సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ సినిమాలతో పాటు.. మరిన్ని ఆఫర్లు ఆమె కోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రభాస్-మారుతి సినిమా. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోబోతున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇలా చేసిన మొదటి సినిమాతోనే, టాప్ లీగ్ లోకి దూసుకుపోతోంది ఈ చిన్నది. రాబోయే రోజుల్లో ఈ హీరోయిన్ మెగా కాంపౌండ్, అక్కినేని కాంపౌండ్ లోకి కూడా ఎంటరవ్వడం ఖాయంగా కనిపిస్తోంది