Telugu Global
National

ఇవేం పాఠాలు మంత్రివర్యా..? కట్నమిస్తే అందంగా లేని ఆడపిల్లలకు కూడా పెళ్లి అవుతుందా?

వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టప్రకారం నేరమని అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది డౌరీ కేసుల్లో ఇరుక్కొని కటకటాలు లెక్కిస్తున్నారు. వరకట్నాన్ని నిషేధించడమే కాకుండా కఠినమైన చట్టాలను అమలు చేసింది. చట్టానికి విరుద్దమైన వరకట్నం వల్ల కలిగే లాభాలు ఎలా ఉంటాయో చెప్తూ.. ఏకంగా టెక్ట్స్ బుక్స్‌లో పాఠంగా పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. నర్సింగ్ కోర్సులోని సోషియాలజీ బుక్‌లో ‘వరకట్నం వల్ల కలిగే లాభాలు’ అంటూ ఏకంగా పెద్ద పాఠాన్నే పెట్టారు. టీకే ఇంద్రాణి రచించిన […]

ఇవేం పాఠాలు మంత్రివర్యా..? కట్నమిస్తే అందంగా లేని ఆడపిల్లలకు కూడా పెళ్లి అవుతుందా?
X

వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టప్రకారం నేరమని అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది డౌరీ కేసుల్లో ఇరుక్కొని కటకటాలు లెక్కిస్తున్నారు. వరకట్నాన్ని నిషేధించడమే కాకుండా కఠినమైన చట్టాలను అమలు చేసింది. చట్టానికి విరుద్దమైన వరకట్నం వల్ల కలిగే లాభాలు ఎలా ఉంటాయో చెప్తూ.. ఏకంగా టెక్ట్స్ బుక్స్‌లో పాఠంగా పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. నర్సింగ్ కోర్సులోని సోషియాలజీ బుక్‌లో ‘వరకట్నం వల్ల కలిగే లాభాలు’ అంటూ ఏకంగా పెద్ద పాఠాన్నే పెట్టారు. టీకే ఇంద్రాణి రచించిన ఈ బుక్‌ను ఇండియాలోని లీడింగ్ పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది. 122వ పేజీలోని చాప్టర్ 6లో ‘మెరిట్స్ ఆఫ్ డౌరీ’ పేరుతో ఆశ్చర్యపరిచే విషయాలు రాశారు.

కట్నం తీసుకోవడం వల్ల అందంగా లేని అమ్మాయిలకు పెళ్లి అవుతుందని.. వాళ్లకు మంచి అబ్బాయో కనీసం అందంగాలేని అబ్బాయైనా దొరుకుతాడని అందులో పేర్కొన్నారు. కట్నం అంటే తల్లిదండ్రుల ఆస్తిలో కొంత అమ్మాయికి వచ్చినట్లే అని తెలిపారు. ఒక వేళ కట్నం ఇవ్వలేని తల్లిదండ్రులు ఉంటే.. వాళ్లు కనీసం అమ్మాయిని మంచి చదువు చెప్పించడానికి ప్రయత్నిస్తారని.. అలా అమ్మాయిల్లో చదువుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుందని.. ఇదంతా కట్నం వల్ల కలిగే ప్రయోజనాలే అని రాసుకొచ్చారు. పెళ్లి అయిన వెంటనే ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి.. కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఈ కట్నం పనికి వస్తుందని సూచించారు.

ఇలాంటి వివాదాస్పద అంశాలను ప్రయోజనాలుగా చెప్పుకుంటూ రాసిన ఈ పాఠాన్ని వెంటనే తొలగించాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. ఆమె ఈ పాఠానికి సంబంధించిన ఫొటోనే ట్వీట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ట్యాగ్ చేసి.. వెంటనే ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని తొలగించాలని కోరారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమైన పాఠమని ఆమె దుయ్యబట్టారు.

First Published:  5 April 2022 6:21 AM IST
Next Story