సోనియమ్మకు బాధ వేసిందట.. ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ షాక్‌కు గురయ్యారు.. చాలా బాధపడ్డారు. ఈ విషయం స్వయంగా ఆమే చెప్పారు. ఇంతకు ఆమెను అంతగా బాధించిన విషయం ఏంటంటే.. రీసెంట్‌గా వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనను ఎంతగానో నిరాశకు గురి చేశాయని సోనియా గాంధీ మంగళవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె అనేక సూచనలు కూడా చేశారు. ‘ఇటీవల వెల్లడైన అసెంబ్లీ […]
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ షాక్‌కు గురయ్యారు.. చాలా బాధపడ్డారు. ఈ విషయం స్వయంగా ఆమే చెప్పారు. ఇంతకు ఆమెను అంతగా బాధించిన విషయం ఏంటంటే.. రీసెంట్‌గా వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనను ఎంతగానో నిరాశకు గురి చేశాయని సోనియా గాంధీ మంగళవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె అనేక సూచనలు కూడా చేశారు.
‘ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఫలితాలు నన్న తీవ్రంగా బాధించాయి. ఇది మనకు పరీక్షా సమయం. అందరం కలసి ఐక్యంగా పని చేయడం అన్ని స్థాయిల్లోనూ అత్యంత అవసరం. దీనికి అవసరమైన చర్యలు నేను తీసుకోబోతున్నాను. సీడబ్ల్యూసీ సమావేశంలో, ఇతర సహచరుల ద్వారా అనేక సూచనలు అందాయి. వాటిపై పని చేస్తున్నాను. పార్టీ తిరిగి పుంజుకోవడం మనకు మాత్రమే కాకుండా.. మన ప్రజాస్వామ్యానికి, సమాజానికి, దేశానికి ఎంతో అవసరం’ అని సోనియా గాంధీ అన్నారు.
కాగా, గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం అన్ని రాష్ట్రాల నాయకులతో మాట్లాడుతున్నది. జీ-23 పేరుతో ఏర్పాటు చేసిన అగ్రనాయకుల బృందం ఇటీవల మీడియాతో ఇష్టానుసారం మాట్లాడటంపై ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ నాయకులు ఐక్యంగా ఉండాలని చెప్పింది అందుకే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడటాన్ని సోనియా సహించలేదని.. అందుకే ఐక్యంగా ఉండాలని సూచిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈ సారి ఎలాగైనా ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని సోనియా అందరికీ దిశానిర్దేశనం చేశారు.