కొవాక్సిన్ సరఫరాకు WHO బ్రేక్..
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కరోనా టీకా, కొవాక్సిన్ ను ఐక్యరాజ్య సమితి ఇకపై సరఫరా చేయదు. యునైటెడ్ నేషన్స్ విభాగమైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కరోనా వ్యాక్సిన్ ని సేకరించి కొన్ని దేశాలకు సరఫరా చేస్తోంది. అయితే ఇప్పుడీ సరఫరాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై ఐక్యరాజ్యసమితి విభాగాల ద్వారా కొవాక్సిన్ సరఫరా నిలిపివేస్తున్నట్టు WHO తెలిపింది. కొవాక్సిన్ సామర్థ్యంపై మాత్రం WHO కామెంట్ చేయలేదు. వ్యాక్సిన్ సురక్షితమైనదని, ప్రభావవంతమైనదని […]
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కరోనా టీకా, కొవాక్సిన్ ను ఐక్యరాజ్య సమితి ఇకపై సరఫరా చేయదు. యునైటెడ్ నేషన్స్ విభాగమైన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కరోనా వ్యాక్సిన్ ని సేకరించి కొన్ని దేశాలకు సరఫరా చేస్తోంది. అయితే ఇప్పుడీ సరఫరాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై ఐక్యరాజ్యసమితి విభాగాల ద్వారా కొవాక్సిన్ సరఫరా నిలిపివేస్తున్నట్టు WHO తెలిపింది. కొవాక్సిన్ సామర్థ్యంపై మాత్రం WHO కామెంట్ చేయలేదు. వ్యాక్సిన్ సురక్షితమైనదని, ప్రభావవంతమైనదని చెబుతూనే.. వ్యాక్సిన్ సరఫరా నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది.
కారణం ఏంటి..?
గతేడాది నవంబర్ 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చింది. దరఖాస్తు చేసుకున్న మూడు నెలల తర్వాత కొవాక్సిన్ కి అనుమతిచ్చింది WHO. దీంతో భారత్ తోపాటు, విదేశాలకు కూడా భారత్ బయోటెక్ సంస్థ కొవాక్సిన్ ని ఎగుమతి చేస్తూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో కొన్ని లోపాలను గుర్తించి ముందుగానే సరఫరాను తగ్గించింది. ఆ లోపాలను సవరించేందుకు వీలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్సిన్ సరఫరాను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 14 నుంచి 22 వరకు WHO నిర్వహించిన పోస్ట్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ తనిఖీల్లో కొవాక్సిన్ లో కొన్ని లోపాలు బయటపడ్డాయని తెలిపింది. ఈ ఫలితాలకు అనుగుణంగానే ఈ నిషేధాన్ని విధించినట్టు ప్రకటించింది. ఇప్పటి వరకూ ఈ టీకాను దిగుమతి చేసుకున్న దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై మాత్రం WHO క్లారిటీ ఇవ్వలేదు.
మా సర్టిఫికెట్ చెల్లుబాటవుతుంది..
అయితే భారత్ బయోటెక్ మాత్రం తమ టీకా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించింది. కొవాక్సిన్ సమర్థతపై WHO నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. కొవాక్సిన్ వేయించుకున్న వారికి జారీ అయిన వ్యాక్సిన్ సర్టిఫికేట్లు చెల్లుబాటులోనే ఉంటాయని తెలిపింది. అదే సమయంలో టీకాకు డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి, సరఫరాను తగ్గిస్తున్నట్టు కూడా తెలిపింది భారత్ బయోటెక్ సంస్థ. WHO అనుమానాలను నివృత్తి చేస్తామని, లోపాలను సవరించుకుంటామని తెలిపింది.