Telugu Global
Cinema & Entertainment

శర్వానంద్ తదుపరి సినిమా ఏంటి?

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ ఇంకా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం శర్వా లిస్టులో ఓ ఇద్దరు దర్శకులు ఉన్నారు. అందులో కృష్ణ చైతన్య కూడా ఒకడు. నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లిరిసిస్ట్ కృష్ణచైతన్య ఆ తర్వాత రెండో సినిమాను నితిన్ తో ‘ఛల్ మోహన్ రంగ’ అంటూ తీశాడు. తాజాగా ఈ యంగ్ రైటర్ కం డైరెక్టర్ శర్వాకి ఓ లైన్ చెప్పి లాక్ […]

శర్వానంద్ తదుపరి సినిమా ఏంటి?
X

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ ఇంకా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం శర్వా లిస్టులో ఓ ఇద్దరు దర్శకులు ఉన్నారు. అందులో కృష్ణ చైతన్య కూడా ఒకడు. నారా రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లిరిసిస్ట్ కృష్ణచైతన్య ఆ తర్వాత రెండో సినిమాను నితిన్ తో ‘ఛల్ మోహన్ రంగ’ అంటూ తీశాడు. తాజాగా ఈ యంగ్ రైటర్ కం డైరెక్టర్ శర్వాకి ఓ లైన్ చెప్పి లాక్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను పీపుల్ మీడియా బేనర్ పై TG విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. శర్వా సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఫైనల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. కీర్తి తో టాక్స్ నడుస్తున్నాయని సమాచారం. శర్వానంద్ నెక్స్ట్ లిస్టులో కొరియోగ్రాఫర్ రాజు సుందరం కూడా ఉన్నాడు. దర్శకుడిగా ఒక సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్న రాజు సుందరం శర్వానంద్ తో మొదటి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మరి ఈ రెండు సినిమాలు ఒకే టైంలో చేస్తాడా ? లేదా కృష్ణ చైతన్య సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకొస్తాడా ? తెలియాల్సి ఉంది. త్వరలో శర్వానంద్ బైలింగ్వెల్ సినిమా ‘ఒకే ఒక జీవితం’ థియేటర్స్ లోకి రానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా గురించి శర్వా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.

First Published:  3 April 2022 12:15 PM IST
Next Story