పబ్ పార్టీలో నిహారిక.. నాగబాబు స్టేట్ మెంట్
ఉన్నట్టుండి సడెన్ గా వార్తల్లోకెక్కింది మెగా డాటర్ కొణెదల నిహారిక. రాత్రి హైదరాబాద్ లో ఓ పబ్ పై పోలీసులు జరిపిన దాడిలో నిహారిక దొరికిపోవడమే దీనికి కారణం. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారని, రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారంటూ ఈరోజు ఉదయం నుంచి మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ పార్టీలో నిహారిక ఉందా? ఆమె డ్రగ్స్ తీసుకుందా? పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారా? రాడిసన్ బ్లూ పబ్ లో రాత్రి నిహారిక […]
ఉన్నట్టుండి సడెన్ గా వార్తల్లోకెక్కింది మెగా డాటర్ కొణెదల నిహారిక. రాత్రి హైదరాబాద్ లో ఓ పబ్ పై పోలీసులు జరిపిన దాడిలో నిహారిక దొరికిపోవడమే దీనికి కారణం. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారని, రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచారంటూ ఈరోజు ఉదయం నుంచి మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ పార్టీలో నిహారిక ఉందా? ఆమె డ్రగ్స్ తీసుకుందా? పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారా?
రాడిసన్ బ్లూ పబ్ లో రాత్రి నిహారిక ఉన్న మాట వాస్తవం. ఆ విషయాన్ని ఆమె తండ్రి నాగబాబు నిర్థారించారు. రాత్రి పబ్ లో నిహారిక ఉందని, అయితే ఆమె ఎలాంటి తప్పు చేయలేదని నాగబాబు అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు తనతో చెప్పారని కూడా నాగబాబు వెల్లడించారు. సమయం మించిపోయినప్పటికీ పబ్ ను నడుపుతున్న కారణంగా పోలీసులు దాడులు చేశారే తప్ప, నిహారికకు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ప్రకటనలో “షీ ఈజ్ క్లీన్” అనే పదాన్ని వాడారు నాగబాబు.
అయితే రాత్రి ఆ పబ్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందనేది వాస్తవం. పోలీసుల్ని చూడగానే అంతా పారిపోయారు. చెల్లాచెదురయ్యారు. తమ దగ్గరున్న డ్రగ్స్ ప్యాకెట్లను ఎక్కడపడితే అక్కడ పడేశారు. అలా డాన్స్ ఫ్లోర్ పై, బాత్రూమ్ లో చెల్లాచెదురుగా పడిన మాదక ద్రవ్యాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాత్రి పార్టీలో వంద మందికి పైగా పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అందులో ప్రముఖులు ఎవరున్నారనే విషయంపై మాత్రం ఇప్పటివరకు పోలీసుల నుంచి స్పష్టత రాలేదు. మరోవైపు ఇదే పార్టీలో మహేష్ బాబు బంధువు గల్లా అశోక్ కూడా ఉన్నాడంటూ కథనాలు వచ్చాయి. వాటిని గల్లా కుటుంబ సభ్యులు ఖండించారు.