Telugu Global
NEWS

కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు వీరే..

ఏపీలో కొత్త జిల్లాలకోసం కొత్తగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి కొత్త జిల్లాలు అధికారికంగా ఉనికిలోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా బదిలీలు, పదోన్నతులతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో 9మందికి స్థాన చలనం లేదు. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ […]

కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు వీరే..
X

ఏపీలో కొత్త జిల్లాలకోసం కొత్తగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం నుంచి కొత్త జిల్లాలు అధికారికంగా ఉనికిలోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా బదిలీలు, పదోన్నతులతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో 9మందికి స్థాన చలనం లేదు. గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్, ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ లను రాష్ట్ర స్థాయి పోస్టుల్లోకి బదిలీ చేశారు. ప్రస్తుతం జేసీలుగా, మున్సిపల్‌ కమిషనర్లుగా, వివిధ రాష్ట్ర స్థాయి పోస్టుల్లో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారుల్లో కొందరికి జిల్లాల పాలనాధికారులుగా అవకాశం లభించింది.

జిల్లాకు ఒకరే జేసీ..
కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు ఏర్పడటంతో.. ఇకపై జాయింట్ కలెక్టర్ల సంఖ్యను తగ్గించింది ప్రభుత్వం. ఇప్పటి వరకూ రెవెన్యూ, హౌసింగ్, సచివాలయాల జేసీలు మొత్తం ముగ్గురు కలెక్టరేట్లలో ఉండేవారు. ఇకపై కేవలం రెవెన్యూ జేసీ మాత్రమే ఉంటారు. ప్రస్తుతం జిల్లాల్లో హౌసింగ్ జేసీ, సచివాలయాల జేసీలుగా ఉన్నవారిని కొత్త జిల్లాలకు రెవెన్యూ జేసీలుగా బదిలీ చేశారు.

వివిధ శాఖల కమిషనర్లుగా కలెక్టర్లు..
గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ని సీఆర్‌డీఏ కమిషనర్‌ గా బదిలీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ను వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ గా నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ నివాస్ ను వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ గా నియమించారు. రవాణాశాఖ కమిషనర్‌ గా కాటమనేని భాస్కర్‌ బదిలీ అయ్యారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా చక్రవర్తి, యువజన వ్యవహారాలు, పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శిగా ని జి.వాణీమోహన్‌ ను బదిలీ చేశారు.

First Published:  3 April 2022 3:14 AM IST
Next Story