Telugu Global
International

87 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వృద్ధుడు.. ఎందుకో తెలుసా..?

కరోనా వ్యాక్సిన్ ఒక్కసారి వేయించుకోడానికే చాలామంది వెనకాడుతుంటారు. చాలా చోట్ల బతిమాలో, బలవంతంగానో.. గ్రామీణులకు వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్లు వేయడం చూస్తున్నాం. అలాంటిది జర్మనీలో 61 ఏళ్ల ఓ వృద్ధుడు ఏకంగా 87 సార్లు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడు. అసలు కారణం తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. కొవిడ్ టీకా వేయించుకోవడం చాలామందికి ఇష్టంలేదు. అది నిర్బంధం కాకపోవడంతో స్వచ్ఛందంగా కొందరు ప్రముఖులు కూడా తాము వ్యాక్సిన్ వేయించుకోలేదని, వేసుకోవడం ఇష్టం లేదని కూడా ప్రకటించారు. సామాన్యుల్లో […]

87 సార్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వృద్ధుడు.. ఎందుకో తెలుసా..?
X

కరోనా వ్యాక్సిన్ ఒక్కసారి వేయించుకోడానికే చాలామంది వెనకాడుతుంటారు. చాలా చోట్ల బతిమాలో, బలవంతంగానో.. గ్రామీణులకు వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్లు వేయడం చూస్తున్నాం. అలాంటిది జర్మనీలో 61 ఏళ్ల ఓ వృద్ధుడు ఏకంగా 87 సార్లు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడు. అసలు కారణం తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే.

కొవిడ్ టీకా వేయించుకోవడం చాలామందికి ఇష్టంలేదు. అది నిర్బంధం కాకపోవడంతో స్వచ్ఛందంగా కొందరు ప్రముఖులు కూడా తాము వ్యాక్సిన్ వేయించుకోలేదని, వేసుకోవడం ఇష్టం లేదని కూడా ప్రకటించారు. సామాన్యుల్లో కూడా చాలామంది వ్యాక్సిన్లకు దూరంగా ఉన్నారు. అయితే విదేశీ ప్రయాణాలు చేయాల్సిన వారు, ఇతరత్రా అవసరాలు ఉన్నవారికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి. జర్మనీలో కూడా టీకా తీసుకున్నవారికి వ్యాక్సిన్ పాస్ అనేది ఇస్తారు. అయితే అక్కడ వ్యాక్సిన్ వేయించుకోవడం ఇష్టం లేని వారికి ఇలా వ్యాక్సిన్ పాస్ అమ్మడమే పనిగా పెట్టుకున్నాడు ఆ వృద్ధుడు.

జర్మనీలో వ్యాక్సిన్ వేయించుకున్నవారి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియ సమగ్రంగా జరగడంలేదు. టీకా వేయించుకున్నవారికి వివరాలు నమోదు చేసిన బుక్ లెట్ ఒకటి ఇస్తారు. దీన్ని వ్యాక్సిన్ పాస్ అంటారు. ఇలాంటి వారు మాత్రమే జనసమూహాల లోకి, షాపింగ్ మాల్స్ లోకి ఎంట్రీ ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లాలన్నా కూడా ఈ పాస్ లు తప్పనిసరి. దీంతో వ్యాక్సిన్ వేయించుకోవడం ఇష్టం లేనివారికి ఈ పాస్ లు అమ్మడమే పనిగా పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. ఏకంగా 87 సార్లు టీకా తీసుకున్నాడు. ఒకే రోజు మూడు సార్లు టీకా తీసుకున్నాడు కూడా. ఇతని కదలికలు అనుమానంగా ఉండటంతో.. డ్రెస్టెన్ నగరంలో రెడ్ క్రాస్ సభ్యులు నిలదీశారు. పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం అతనిపై విచారణ మొదలైంది. బహుశా అతను ఇంకా ఎక్కువసార్లే వ్యాక్సిన్ తీసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు.

First Published:  3 April 2022 3:45 AM IST
Next Story