Telugu Global
Sports

ప్రపంచకప్ సాకర్ డ్రా ఖరారు.. ఒకే గ్రూపులో అమెరికా, ఇరాన్

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రీడావేడుక 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ సంరంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకూ జరిగే ఈ ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ దేశం ఖతర్ ఆతిథ్యమిస్తోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగాటోర్నీ ఫైనల్ రౌండ్లో తలపడే మొత్తం 32 జట్ల బెర్త్ ల కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఖండాలకు చెందిన 204 దేశాలు ప్రాధమిక రౌండ్ పోరులో పాల్గొన్నాయి. ఇప్పటికే మొత్తం 29 దేశాలజట్లు ఫైనల్ రౌండ్ కు […]

ప్రపంచకప్ సాకర్ డ్రా ఖరారు.. ఒకే గ్రూపులో అమెరికా, ఇరాన్
X

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రీడావేడుక 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ సంరంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకూ జరిగే ఈ ప్రపంచ యుద్ధానికి గల్ఫ్ దేశం ఖతర్ ఆతిథ్యమిస్తోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగాటోర్నీ ఫైనల్ రౌండ్లో తలపడే మొత్తం 32 జట్ల బెర్త్ ల కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఖండాలకు చెందిన 204 దేశాలు ప్రాధమిక రౌండ్ పోరులో పాల్గొన్నాయి. ఇప్పటికే మొత్తం 29 దేశాలజట్లు ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించడంతో.. దోహా ఎగ్జిబిషన్‌, కన్వెన్షన్‌ కేంద్రంగా డ్రా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో ప్రారంభ ఉపనాస్యం తో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రపంచ సాకర్ ప్రముఖులు, దిగ్గజ ఆటగాళ్లు పాల్గొన్నారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో మాజీ చాంపియన్లు జర్మనీ, స్పెయిన్ తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు అమెరికా, ఇరాన్ జట్లు 1998 తరువాత తొలిసారిగా గ్రూప్ లీగ్ దశలోనే ఢీకొనబోతున్నాయి.

60వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన అల్ బేయత్ స్టేడియం వేదికగా జరిగే పోరులో ఆతిథ్య ఖతర్ , సెనెగల్ పోటీపడతాయి. 2018 తరువాత తొలిసారిగా ఫైనల్ రౌండ్లో పాల్గొంటున్న నెదర్లాండ్స్ జట్టు గ్రూపు-ఏ లీగ్ లో తన అదృష్టం పరీక్షించుకోనుంది. ప్రస్తుత చాంపియన్ ఫ్రాన్స్ గ్రూప్ – డీ లీగ్ లో డెన్మార్క్, ట్యునీసియాల నుంచి పోటీ ఎదుర్కోనుంది. ఐదుసార్లు విన్నర్ బ్రెజిల్..గ్రూపు-జీ లీగ్ లో సెర్బియా, స్విట్జర్లాండ్, కమెరూన్ జట్లతో తలపడనుంది. రెండుసార్లు విజేత అర్జెంటీనా గ్రూపు- సీ లీగ్ లో సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్ జట్లుతో అమీతుమీ తేల్చుకోనుంది.

32 జట్ల సమరం..
ఇప్పటికే 29 జట్లు ఫైనల్ రౌండ్లో చోటు సంపాదించగా..మిగిలిన మూడు స్థానాల కోసం ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ రౌండ్ పోటీలు నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియా, పెరూ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, న్యూజిలాండ్, కోస్టారికా జట్లు మిగిలిన మూడు బెర్త్ లకు గురిపెట్టాయి.

2022 ప్రపంచకప్ సాకర్ విజేత ఎవరో తేల్చుకోడానికి జరిగే టైటిల్ సమరాన్ని గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ రౌండ్ తరహాలో నిర్వహిస్తారు. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించి.. లీగ్ దశ సమరాన్ని నిర్వహించనున్నారు.

గ్రూపు-ఏ లీగ్ లో ఆతిథ్య ఖతర్ జట్టుతో పాటు ఈక్వెడార్‌, సెనెగల్‌, నెదర్లాండ్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

గ్రూపు-బిలో ఇరాన్‌, అమెరికా, ఇంగ్లండ్‌ ఢీ కొనబోతున్నాయి. గ్రూపు-సిలో అర్జెంటీనా, సౌదీఅరేబియా, మెక్సికో, పోలాండ్‌, గ్రూపు-డిలో ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, ట్యునీషియా చోటు దక్కించుకున్నాయి.

మొత్తం ఎనిమిది గ్రూపుల వివరాలు..
గ్రూప్‌ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, నెదర్లాండ్స్, సెనెగల్‌.
గ్రూప్‌ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, స్కాట్లాండ్‌ /వేల్స్‌/ఉక్రెయిన్‌.
గ్రూప్‌ ‘సి’: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌.
గ్రూప్‌ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/ పెరూ.
గ్రూప్‌ ‘ఇ’: స్పెయిన్, జర్మనీ, జపాన్, కోస్టారికా/న్యూజిలాండ్‌.
గ్రూప్‌ ‘ఎఫ్‌’: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా.
గ్రూప్‌ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్‌.
గ్రూప్‌ ‘హెచ్‌’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, కొరియా.

First Published:  2 April 2022 7:39 AM IST
Next Story