Telugu Global
Sports

మహిళా క్రికెట్ ప్రపంచకప్ లో టైటిల్ పోరు..

ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ సమరానికి కివీ గడ్డపైన రంగం సిద్ధమయ్యింది. న్యూజిలాండ్ లోని వివిధ వేదికల్లో గత మూడువారాలుగా నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ జట్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు అర్హత సంపాదించాయి. ఆదివారం జరిగే తుదిపోరులో నాలుగుసార్లు విజేత ఇంగ్లండ్ కు ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా సవాలు విసురుతోంది. నాకౌట్ సెమీఫైనల్స్ లో దక్షిణాప్రికాను ఇంగ్లండ్, వెస్టిండీస్ ను ఆస్ట్రేలియాజట్లు అలవోకగా ఓడించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి. రెండుజట్లు […]

మహిళా క్రికెట్ ప్రపంచకప్ లో టైటిల్ పోరు..
X

ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ టోర్నీలో టైటిల్ సమరానికి కివీ గడ్డపైన రంగం సిద్ధమయ్యింది. న్యూజిలాండ్ లోని వివిధ వేదికల్లో గత మూడువారాలుగా నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్స్ కు హాట్ ఫేవరెట్ జట్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు అర్హత సంపాదించాయి. ఆదివారం జరిగే తుదిపోరులో నాలుగుసార్లు విజేత ఇంగ్లండ్ కు ఆరుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా సవాలు విసురుతోంది. నాకౌట్ సెమీఫైనల్స్ లో దక్షిణాప్రికాను ఇంగ్లండ్, వెస్టిండీస్ ను ఆస్ట్రేలియాజట్లు అలవోకగా ఓడించడం ద్వారా టైటిల్ సమరానికి అర్హత సంపాదించాయి.

రెండుజట్లు సమఉజ్జీలు కావడంతో సూపర్ సండే టైటిల్ ఫైట్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. 1973 నుంచి నిర్వహిస్తున్న మహిళా వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఈ రెండుజట్లకూ తిరుగులేని రికార్డే ఉంది.

ఆరుసార్లు విజేత ఆస్ట్రేలియా..

మహిళా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి వన్డే ప్రపంచకప్ పోటీలను 1973లో నిర్వహించారు. ఇంగ్లండ్ జట్టు తొలిమహిళా విశ్వవిజేతగా అవతరించింది. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన రెండో ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా హవా ప్రారంభమయ్యింది. 1978, 1982, 1988 సంవత్సరాలలో ఆస్ట్రేలియా మహిళలు వరుసగా మూడు ప్రపంచకప్ లు నెగ్గి.. హ్యాట్రిక్ సాధించిన ఘనత సొంతం చేసుకొన్నారు. 1993 ప్రపంచకప్ ను ఇంగ్లండ్ గెలుచుకొంటే..భారత్ ఆతిథ్యంలో జరిగిన 1997 ప్రపంచకప్ టోర్నీలో తిరిగి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.

2000 సంవత్సరంలో జరిగిన ప్రపంచకప్ ను న్యూజిలాండ్ తొలిసారిగా గెలుచుకొంటే.. 2005 ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా, 2009 ప్రపంచకప్ ను ఇంగ్లండ్ సొంతం చేసుకొన్నాయి. 2013లో జరిగిన పదో ప్రపంచకప్ ను తిరిగి ఆస్ట్రేలియా గెలుచుకొంది. మహిళా ప్రపంచకప్ ను ఆరుసార్లు నెగ్గిన ఒకే ఒక్కజట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.

మరోవైపు ప్రస్తుత చాంపియన్ ఇంగ్లండ్ కు నాలుగుసార్లు విశ్వవిజేతగా నిలిచిన రికార్డు ఉంది. 1973, 1993, 2009, 2017 టోర్నీలలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఓవైపు ..రికార్డు స్థాయిలో ఏడో ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా ఎదురుచూస్తుంటే.. మరోవైపు ఐదో టైటిల్ కు ఇంగ్లండ్ గురిపెట్టింది. రెండుజట్లూ సూపర్ ఫామ్ లో ఉండటం, సమానబలం కలిగి ఉండటంతో టైటిల్ సమరం ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. క్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ వేదికగా జరిగే తుదిపోరు కోసం క్రికెట్ అభిమానులంతా ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కు తెలుగు మహిళ, ఆంధ్ర మాజీ ప్లేయర్ లక్ష్మీ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. మిథాలీరాజ్ నాయకత్వంలోని భారతజట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.

First Published:  2 April 2022 9:42 AM IST
Next Story