మళ్లీ మొదలైన బాదుడు : 12 రోజుల్లో 7.20 పెరిగిన పెట్రోల్ !
అటు యుద్ధం.. ఇటు శ్రీలంక సంక్షోభం. మధ్యలో మనదేశంలో కూడా పెట్రోల్ మంట మొదలైంది. 12 రోజుల్లో 7 రూపాయల 20 పైసలు పెరిగింది. ఇవాళ ఒక్కసారిగా పెట్రోల్ ధర 80 పైసలు పెరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరలు పెరగలేదు. పది రోజులుగా పెట్రో బాదుడు మొదలైంది. శుక్రవారం ధరలు పెంచలేదు. కానీ ఇవాళ ఒక్కసారిగా 80 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 116 రూపాయలు దాటేసింది. ఇటు పెట్రోలే కాదు. […]
అటు యుద్ధం.. ఇటు శ్రీలంక సంక్షోభం. మధ్యలో మనదేశంలో కూడా పెట్రోల్ మంట మొదలైంది. 12 రోజుల్లో 7 రూపాయల 20 పైసలు పెరిగింది. ఇవాళ ఒక్కసారిగా పెట్రోల్ ధర 80 పైసలు పెరిగింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరలు పెరగలేదు. పది రోజులుగా పెట్రో బాదుడు మొదలైంది. శుక్రవారం ధరలు పెంచలేదు. కానీ ఇవాళ ఒక్కసారిగా 80 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 116 రూపాయలు దాటేసింది. ఇటు పెట్రోలే కాదు. డీజిల్ కూడా పెరిగింది. హైదరాబాద్‌లో డీజీల్ ధర 102.61 రూపాయలకు చేరుకుంది.
ఇటు ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి. పెట్రోల్ లీటర్ ధర 102.61, డీజిల్ రూ. 93.87గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.117.57, డీజిల్ ధర రూ. 101.79కి చేరుకున్నాయి