తెలుగు మహిళకు అరుదైన గౌరవం
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న 2022 మహిళా వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. క్రైస్ట్ చర్చి వేదికగా ఆదివారం జరిగే టైటిల్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా సవాలు విసురుతోంది. అయితే..మిథాలీ నాయకత్వంలోని భారతజట్టు లీగ్ దశ నుంచే ఇంటిదారి పడితే.. ఆంధ్ర మాజీ క్రికెటర్, తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచిన లక్ష్మి ఫైనల్లో మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఐసీసీ ప్యానల్ మ్యాచ్ రిఫరీగా ఎంపికైన తెలుగు తొలిమహిళగా చరిత్ర సృష్టించిన గండికోట […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న 2022 మహిళా వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. క్రైస్ట్ చర్చి వేదికగా ఆదివారం జరిగే టైటిల్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కు మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా సవాలు విసురుతోంది. అయితే..మిథాలీ నాయకత్వంలోని భారతజట్టు లీగ్ దశ నుంచే ఇంటిదారి పడితే.. ఆంధ్ర మాజీ క్రికెటర్, తెలుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచిన లక్ష్మి ఫైనల్లో మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఐసీసీ ప్యానల్ మ్యాచ్ రిఫరీగా ఎంపికైన తెలుగు తొలిమహిళగా చరిత్ర సృష్టించిన గండికోట సర్వ లక్ష్మీ ఏకంగా ఫైనల్ కే మ్యాచ్ రిఫరీగా ఎదిగిపోయారు. గతంలో పురుషుల వన్డే మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్న లక్ష్మి..మరో ముగ్గురు మహిళా అంపైర్లతో కలసి..
మరి కొద్దిగంటల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ప్రపంచకప్ టైటిల్ సమరం నిర్వహించే బాధ్యతను చేపట్టనున్నారు. ఈ మ్యాచ్‌కు ఇద్దరు ఫీల్డ్ అంపైర్లతో పాటు టీవీ అంపైర్, మ్యాచ్ రిఫరీ.. అందరూ మహిళలే కావడం విశేషం. ఐసీసీ చరిత్రలో నలుగురు మహిళలు ఒకే మ్యాచ్‌కు బాధ్యతలు నిర్వర్తించనుండటం కూడా ఇదే తొలిసారి. ప్రస్తుత చాంపియన్ ఇంగ్లండ్ ఆరవసారి ప్రపంచకప్ ఫైనల్లో తన అదృష్టం పరీక్షించకోనుంది.