Telugu Global
International

గర్భం వారికి ఇష్టంలేదు.. అయినా..!

మాతృత్వం ఓ మధురానుభూతి. సంతానం కోసం గర్భందాల్చడం సహజ ప్రక్రియ. కానీ నేడు ప్రపంచంలో జరుగుతున్న గర్భధారణల్లో సగానికి సగం ఇష్టంలేకుండా జరుగుతున్నాయనే నిజం విస్తుగొలుపుతోంది. దీనివల్ల జరిగే పరిణామాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏకంగా మహిళల ప్రాణాలే తీస్తున్నాయి. అవాంఛిత గర్భాలను తొలగించుకునే క్రమంలో ఏటా 5నుంచి 13శాతం మంది మహిళలు మరణిస్తున్నారంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ఎందుకిలా..? సంతానం కోసమే శృంగారం అనే భావన క్రమంగా తొలగిపోవడంతో అవాంఛిత గర్భాలు ఎక్కువవుతున్నాయి. విద్య, […]

గర్భం వారికి ఇష్టంలేదు.. అయినా..!
X

మాతృత్వం ఓ మధురానుభూతి. సంతానం కోసం గర్భందాల్చడం సహజ ప్రక్రియ. కానీ నేడు ప్రపంచంలో జరుగుతున్న గర్భధారణల్లో సగానికి సగం ఇష్టంలేకుండా జరుగుతున్నాయనే నిజం విస్తుగొలుపుతోంది. దీనివల్ల జరిగే పరిణామాలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏకంగా మహిళల ప్రాణాలే తీస్తున్నాయి. అవాంఛిత గర్భాలను తొలగించుకునే క్రమంలో ఏటా 5నుంచి 13శాతం మంది మహిళలు మరణిస్తున్నారంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు.

ఎందుకిలా..?
సంతానం కోసమే శృంగారం అనే భావన క్రమంగా తొలగిపోవడంతో అవాంఛిత గర్భాలు ఎక్కువవుతున్నాయి. విద్య, వైద్యంపై అవగాహన పెరిగినా కూడా గర్భనిరోధక సాధనాల వాడకంపై ప్రజల్లో ఆ స్థాయి అవగాహన లేదు. దీంతో అవాంఛిత గర్భాలు, గర్భస్రావాలు ఎక్కువయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 12.1 కోట్ల గర్భధారణలు అవాంఛితాలేనని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్‌ ఫండ్‌ తెలిపింది. తీవ్రమైన ఈ సమస్యను ఏ దేశ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని పేర్కొంది. వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌–2022 ప్రకారం అవాంఛిత గర్భం దాల్చిన వారిలో 60శాతం మంది అబార్షన్‌ చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇందులో సుమారు 45శాతం సురక్షితం కాని అబార్షన్లు కాగా, అబార్షన్ల సమయంలో 5నుంచి 13 శాతం మంది అనారోగ్యంపాలై మరణిస్తున్నారు.

1990–2019 మధ్య 15–49 ఏళ్ల గ్రూపులో అవాంఛిత గర్భాల సంఖ్య కొంతమేర తగ్గటం ఊరటనిచ్చే అంశం. ప్రతి వెయ్యి మంది మహిళల్లో అవాంఛిత గర్భాలు 79 నుంచి 64కు తగ్గాయి. అయితే 15 సంవత్సరాలకంటే దిగువ, 49 ఏళ్లకంటే పైవయసు మహిళల్లో గర్భధారణలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 30 ఏళ్లలో అవాంఛిత గర్భం దాల్చిన మహిళల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 13శాతం పెరిగింది. జనాభా పెరుగుదలే దీనికి మూలకారణం అని వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అంచనా వేస్తోంది.

సంతాన సామర్థ్యం అధికంగా ఉన్న ఉన్న 64 దేశాల్లోని మహిళలపై ఈ సర్వే చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా 25.7 కోట్ల మంది మహిళలు గర్భం వద్దనుకుంటూనే శృంగార చర్యల్లో పాల్గొంటున్నారని అలాంటివారు సురక్షితమైన, ఆధునిక గర్భ నిరోధక సాధనాలు వాడటం లేదని సర్వే తెలిపింది. తమ ఆరోగ్యం గురించి 24శాతం మంది మహిళలు, గర్భనిరోధక సాధనాల వాడకం విషయంలో 8శాతం మంది మహిళలు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని సర్వేలో తేలింది.

First Published:  1 April 2022 2:48 AM IST
Next Story