Telugu Global
Sports

ఐపీఎల్ లో సరికొత్త రికార్డు.. మలింగను మించిన బ్రావో

ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ పోరులోనే సరికొత్త రికార్డు నమోదయ్యింది. గత 15 సీజన్లుగా ఐపీఎల్ బరిలో నిలిచిన ఎవర్ గ్రీన్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో అత్యధిక వికెట్ల వీరుడి ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఇప్పటి వరకూ ముంబై మాజీ పేసర్ లాసిత్ మలింగ పేరుతో ఉన్న 170 వికెట్ల రికార్డును బ్రావో అధిగమించాడు. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన రెండోరౌండ్ పోరులో దీపక్ […]

ఐపీఎల్ లో సరికొత్త రికార్డు.. మలింగను మించిన బ్రావో
X

ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ పోరులోనే సరికొత్త రికార్డు నమోదయ్యింది. గత 15 సీజన్లుగా ఐపీఎల్ బరిలో నిలిచిన ఎవర్ గ్రీన్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో అత్యధిక వికెట్ల వీరుడి ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఇప్పటి వరకూ ముంబై మాజీ పేసర్ లాసిత్ మలింగ పేరుతో ఉన్న 170 వికెట్ల రికార్డును బ్రావో అధిగమించాడు. ముంబై బ్రబోర్న్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన రెండోరౌండ్ పోరులో దీపక్ హుడా వికెట్ పడగొట్టడం ద్వారా బ్రావో అరుదైన ఈ ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

ప్రస్తుత సీజన్ ప్రారంభమ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 3 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ 170 వికెట్ల రికార్డును సమం చేసిన బ్రావో..రెండోరౌండ్ మ్యాచ్ ద్వారా.. ఒకే ఒక్క వికెట్ పడగొట్టడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. యార్కర్ల కింగ్ లాసిత్ మలింగ 122 మ్యాచ్ ల్లోనే 170 వికెట్లు పడగొడితే.. మీడియం పేసర్ బ్రావో మాత్రం 152 మ్యాచ్ ల్లో 171 వికెట్ల మైలురాయిని చేరగలిగాడు. ఐపీఎల్ ఓ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ను రెండుసార్లు సాధించిన అరుదైన ఘనత కూడా బ్రావోకే సొ్ంతం. మలింగ 170 వికెట్లను 19.79 సగటుతో సాధిస్తే..బ్రావో మాత్రం 24 సగటుతో నిలిచాడు.

First Published:  1 April 2022 3:44 AM IST
Next Story