Telugu Global
Sports

7 వేల పరుగుల మహేంద్రసింగ్ ధోనీ.. టీ-20 క్రికెట్లో 5వ భారత క్రికెటర్

భారత ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ , చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ధూమ్ ధామ్ టీ-20 కికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరాడు. గత 15 సీజన్లుగా ఐపీఎల్ లో పాల్గొంటూ వస్తున్న వెటరన్ ధోనీ 39 సంవత్సరాల లేటు వయసులో ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లీగ్ దశ రెండోరౌండ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ తో […]

7 వేల పరుగుల మహేంద్రసింగ్ ధోనీ.. టీ-20 క్రికెట్లో 5వ భారత క్రికెటర్
X

భారత ఆల్ టైమ్ గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ , చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ధూమ్ ధామ్ టీ-20 కికెట్లో 7 వేల పరుగుల మైలురాయిని చేరాడు.
గత 15 సీజన్లుగా ఐపీఎల్ లో పాల్గొంటూ వస్తున్న వెటరన్ ధోనీ 39 సంవత్సరాల లేటు వయసులో ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లీగ్ దశ రెండోరౌండ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ తో ముగిసిన మ్యాచ్ లో 16 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలవడం ద్వారా ధోనీ 7వేల పరుగుల క్లబ్ లో చోటు సంపాదించాడు.

గతంలో ఇదే ఘనత సాధించిన భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లి (10,326), రోహిత్ శర్మ (9, 936), శిఖర్ ధవన్ (8, 818), రాబిన్ ఊతప్ప (7, 070) ఉన్నారు. లక్నోతో మ్యాచ్ కు ముందు వరకూ 6985 పరుగులు సాధించిన ధోనీ..16 పరుగుల స్కోరుతో 7 వేల పరుగుల రికార్డును అందుకోగలిగాడు.

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక టీ-20 పరుగులు సాధించిన ఘనత కరీబియన్ డైనమైట్ క్రిస్ గేల్ కు మాత్రమే దక్కుతుంది. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 14,562 పరుగులతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. షోయబ్ మాలిక్, కీరాన్ పోలార్డ్, ఆరోన్ ఫించ్ ఆ తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో కోల్ కతా పై ధోనీ కేవలం 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తనలో వాడివేడి తగ్గలేదని చాటుకొన్నాడు.

First Published:  1 April 2022 3:49 AM IST
Next Story