ఏపీలోనూ ఒంటిపూట బడులు..
తెలంగాణలో ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కేవలం 3 గంటలు మాత్రమే పాఠాలు చెప్పి పిల్లలను ఇంటికి పంపించేస్తున్నారు. అయితే ఏపీలో కాస్త ఆలస్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో స్కూళ్లకు సంబంధించి ఒంటి పూట బడుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవి తీవ్రత ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము […]
తెలంగాణలో ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కేవలం 3 గంటలు మాత్రమే పాఠాలు చెప్పి పిల్లలను ఇంటికి పంపించేస్తున్నారు. అయితే ఏపీలో కాస్త ఆలస్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో స్కూళ్లకు సంబంధించి ఒంటి పూట బడుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వేసవి తీవ్రత ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7:30 నుంచి 11:30 గంటల వరకు కేవలం 4 గంటలు మాత్రమే స్కూళ్లు ఉంటాయని ఆయన తెలిపారు.
కరోనా కారణంగా గత రెండు విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధన పడకేసింది. ఆన్ లైన్ క్లాసులతో పెద్దగా ప్రయోజనం లేదని తేలిపోయింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. దీంతో ఈ ఏడాది పగడ్బందీగా తరగతులు నిర్వహిస్తున్నారు. థర్డ్ వేవ్ భయాలతో తెలంగాణలో స్కూళ్లకు సెలవలు ఇచ్చినా, ఏపీలో మాత్రం ఇవ్వలేదు. తెలంగాణలో మార్చి 15నుంచి ఒంటిపూట బడులు మొదలయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యార్థులు సిలబస్ విషయంలో నష్టపోకూడదనే ఉద్దేశంతో ఒంటిపూట బడుల విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఏపీలో కూడా ఉష్ణోగ్రతల్లో భారీగా పెరుగుదల ఉండటం, ఎండలు మండిపోతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు మొదలు పెడుతోంది.
ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఏపీలో ఏప్రిల్ 27 నుంచి పదో తరగతి పరీక్షలు, మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.