Telugu Global
Cinema & Entertainment

టైగర్ నాగేశ్వరరావు వచ్చేస్తున్నాడు

మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఉగాది రోజున (ఏప్రిల్ 2న) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఉగాది నాడు […]

టైగర్ నాగేశ్వరరావు వచ్చేస్తున్నాడు
X

మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.

ఉగాది రోజున (ఏప్రిల్ 2న) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ ను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'తో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్.

టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సినిమా. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్టుపురం నాగేశ్వరరావు కథ. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం. పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు రవితేజ పూర్తిగా తనను తాను మలుచుకోనున్నాడు. అందుకు తగిన బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి.. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలో రవితేజ కనబడనున్నాడు.

దర్శకుడు వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

First Published:  31 March 2022 3:20 PM IST
Next Story