Telugu Global
NEWS

ఐసీయూలో పేషెంట్‌పై ఎలుకల దాడి.. వరంగల్‌ ఎంజీఎంలో దారుణం

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యాలయం.. ఆ రోగిని అపస్మారకస్థితికి చేర్చింది. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ పేషెంట్‌ బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం శ్రీనివాస్‌ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనిపై ఎలుకలు దాడి చేశాయి. పేషెంట్‌ కాళ్లను, చేతి […]

ఐసీయూలో పేషెంట్‌పై ఎలుకల దాడి.. వరంగల్‌ ఎంజీఎంలో దారుణం
X

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యాలయం.. ఆ రోగిని అపస్మారకస్థితికి చేర్చింది. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆ పేషెంట్‌ బంధువులు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళితే..
నాలుగు రోజుల క్రితం శ్రీనివాస్‌ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఐసీయూలో శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతున్న అతనిపై ఎలుకలు దాడి చేశాయి. పేషెంట్‌ కాళ్లను, చేతి వేళ్లను ఎలుకలు కొరికి బలమైన గాయాలు చేశాయి. దీంతో పడుకున్న బెడ్‌ అంతా రక్తసిక్తమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో పేషెంట్‌ అపస్మారకస్థితిలో ఉన్నారు.

అయితే.. ఐసీయూలో ఉండే పేషెంట్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఎలుకలు దాడి చేశాయని, శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. శానిటేషన్, డ్రైనేజీ నిర్వహణ లోపం కారణంగానే ఎలుక బెడద ఎక్కువైందని, వాటిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు.

First Published:  31 March 2022 10:00 AM IST
Next Story