Telugu Global
Cinema & Entertainment

గని నాన్-థియేట్రికల్ రూ.25 కోట్లు

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనాయిసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతలు. నిర్మాతలుగా వీళ్లకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కూడా హిట్టయింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా […]

గని నాన్-థియేట్రికల్ రూ.25 కోట్లు
X

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, రెనాయిసెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతలు. నిర్మాతలుగా వీళ్లకు ఇదే తొలి సినిమా.

ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కూడా హిట్టయింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది.

గని డిజిటల్ రైట్స్ ను ఆహా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఛానెల్ దక్కించుకున్నాయి. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

First Published:  31 March 2022 3:16 PM IST
Next Story