Telugu Global
Cinema & Entertainment

ఆది సాయికుమార్ నుంచి మరో రిలీజ్

మహంకాళి మూవీస్ బ్యానర్ పై ఆది సాయికుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”. ఈ చిత్రం లో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. తన కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందంటున్నాడు ఆది. ఇటీవల విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. బ్లాక్ చిత్రం […]

ఆది సాయికుమార్ నుంచి మరో రిలీజ్
X

మహంకాళి మూవీస్ బ్యానర్ పై ఆది సాయికుమార్ హీరో గా జి బి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”. ఈ చిత్రం లో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. తన కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందంటున్నాడు ఆది. ఇటీవల విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.

బ్లాక్ చిత్రం చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు దర్శకుడు. ఆది గెటప్, లుక్, యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటాయని చెబుతున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలో ట్రైలర్ ను విడుదల చేసి ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేస్తారు. ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు ఆది సాయికుమార్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ, థియేటర్లలో మాత్రం అతడి సినిమాలు నిలబడడం లేదు. దీంతో ఫార్ములా సినిమాలు తగ్గించి, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే బ్లాక్ సినిమా చేశాడు ఆది. ఈ సినిమాపై ఈ హీరో చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

First Published:  31 March 2022 3:13 PM IST
Next Story