Telugu Global
Cinema & Entertainment

దుబాయ్ పని పూర్తిచేసిన నాగ్

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్`. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రబృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్ తో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ […]

దుబాయ్ పని పూర్తిచేసిన నాగ్
X

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ఘోస్ట్'. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది.

చిత్రబృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్ తో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా వస్తోంది. ముఖ్యంగా ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ అవుతాయంటున్నారు.

ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ తో పాటు గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

శ్రీవెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  30 March 2022 3:28 PM IST
Next Story