జనగణమన లాంఛ్ చేసిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండతో యాక్షన్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్న వెంచర్ జనగణమన. దీనికి “JGM” అని పేరు పెట్టారు. ఈ రోజు ముంబైలో గ్రాండ్ గా ప్రారంభమైంది “JGM”. హెలికాప్టర్ లో పత్యేకంగా దిగిన విజయ్ దేవరకొండ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతడి లుక్ బాగుంది. వినూత్నంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలు చార్మికౌర్, వంశీ పైడిపల్లి మరియు […]
విజయ్ దేవరకొండతో యాక్షన్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్న వెంచర్ జనగణమన. దీనికి “JGM” అని పేరు పెట్టారు. ఈ రోజు ముంబైలో గ్రాండ్ గా ప్రారంభమైంది “JGM”.
హెలికాప్టర్ లో పత్యేకంగా దిగిన విజయ్ దేవరకొండ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతడి లుక్ బాగుంది. వినూత్నంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాతలు చార్మికౌర్, వంశీ పైడిపల్లి మరియు శ్రీకర స్టూడియోస్ డైరెక్టర్ సింగారావు పాల్గొన్నారు.
లాంఛింగ్ లో భాగంగా ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఇండియా మేప్ తో పాటు కొందరు సైనికులు కనిపించారు. యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం వుంటుందని తెలుస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూరి జగన్నాధ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ లో.. ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం JGM.. యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ఇది.
ఈ సినిమా స్క్రిప్ట్ చాలా అద్భుతంగా, ఛాలెంజింగ్ గా ఉందంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇంతకుముందు ఇలా కథ, పాత్ర లో నటించలేదని.. కచ్చితంగా ఇది ప్రతి భారతీయుడ్ని కదిలిస్తుందని చెప్పుకొచ్చాడు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 3న జేజీఎంను విడుదల చేయబోతున్నారు.