Telugu Global
Cinema & Entertainment

నెల రోజుల్లోపే ఓటీటీలో రాధేశ్యామ్

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. మార్చ్ 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే రాధాకృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు […]

Radhe Shyam Movie
X

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఇండియా లవ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. మార్చ్ 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

ప్రభాస్, పూజా హెగ్డే కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే రాధాకృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణ. అద్భుతమైన సెట్లు.. దానికి మించిన విజువల్ ఎఫెక్ట్స్ రాధే శ్యామ్ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఈ సినిమా నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

తాజాగా అభిమానులకు మరో తీపి కబురు చెప్పారు రాధే శ్యామ్ యూనిట్. ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మ్యాజికల్ లవ్ జర్నీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసారు. అమెజాన్‌లో ఈ ప్రేమకథను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని.. ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా అంతా రాధే శ్యామ్‌తో ప్రేమలో పడిపోతారని చెప్తున్నారు దర్శక నిర్మాతలు.
గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలు.

ఓటీటీ రిలీజ్ ను గ్రాండ్ గా ప్రకటించిన మేకర్స్, ఆ వెంటనే ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. ఓవైపు రాధేశ్యామ్ థియేటర్లలో ఉంది. మరోవైపు థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత 7వారాల వరకు ఓటీటీకి కంటెంట్ ఇవ్వకూడదనే నిబంధన కూడా ఉంది. అయినప్పటికీ రాధేశ్యామ్ సినిమాను ఇలా నెల రోజుల్లోపే ఓటీటీకి ఇచ్చేయడంపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  28 March 2022 2:42 PM IST
Next Story