Telugu Global
Cinema & Entertainment

ప్రేమ తక్కువ.. రొమాన్స్ ఎక్కువ

నాగశౌర్య కొత్త సినిమా కృష్ణ వ్రిందా విహారి. ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు ఓ రకమైన మంచి ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మరింత పెరిగింది. ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసిన తర్వాత అప్పటివరకు మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం పోయింది, మరో కొత్త అనుభూతి చోటు చేసుకుంటుంది. అవును.. కృష్ణ వ్రిందా విహారి టీజర్ లో ప్రేమ తక్కువ, రొమాన్స్ ఎక్కువగా ఉంది. క్యూట్ గా […]

ప్రేమ తక్కువ.. రొమాన్స్ ఎక్కువ
X

నాగశౌర్య కొత్త సినిమా కృష్ణ వ్రిందా విహారి. ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు ఓ రకమైన మంచి ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మరింత పెరిగింది. ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసిన తర్వాత అప్పటివరకు మనసులో ఉన్న ఫీలింగ్ మొత్తం పోయింది, మరో కొత్త అనుభూతి చోటు చేసుకుంటుంది.

అవును.. కృష్ణ వ్రిందా విహారి టీజర్ లో ప్రేమ తక్కువ, రొమాన్స్ ఎక్కువగా ఉంది. క్యూట్ గా టీజర్ ను స్టార్ట్ చేసి రొమాంటిక్ దారిలోకి తీసుకెళ్లారు. ఆ విజువల్స్ ను రొమాంటిక్ అనడం కంటే, ఇంకాస్త పెద్ద పదం వాడితే బెటరేమో. హీరోయిన్ తన నైటీని కాస్త పైకెత్తి, హీరోపైకి వెళ్లడం. హీరో బనియన్ పట్టుకొని తనపైకి లాక్కోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే టీజర్ లో వేడివేడి సన్నివేశాలు బాగానే దట్టించారు.

సినిమాకు లవ్ స్టోరీ అనే కలరింగ్ ఇస్తూనే, ఈమధ్య ఇలా కాస్త ఘాటుగా చూపించడం టాలీవుడ్ లో ఫ్యాషన్ అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇదొక మార్కెట్ ఫార్ములా అయిపోయింది. ఇలా ఉంటే ఓటీటీ డీల్స్ త్వరగా లాక్ అవుతున్నాయి మరి.

ఈ సంగతి పక్కనపెడితే.. టీజర్ మాత్రం రిచ్ గా ఉంది. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. హీరోహీరోయిన్లు ఇద్దరూ బాగున్నారు. మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అనీష్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  28 March 2022 2:56 PM IST
Next Story