Telugu Global
Cinema & Entertainment

డేట్ ఫిక్స్ చేసిన వారియర్

రామ్ పోతినేని హీరోగా, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇప్పటివరకూ రామ్ పోలీస్ రోల్ చేయలేదు. ‘ది వారియర్’ కోసం ఆయన తొలిసారి ఖాకీ యూనిఫామ్ వేశాడు. రామ్ పోతినేని – లింగుస్వామి కాంబినేషన్‌లో […]

డేట్ ఫిక్స్ చేసిన వారియర్
X

రామ్ పోతినేని హీరోగా, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.

ఇప్పటివరకూ రామ్ పోలీస్ రోల్ చేయలేదు. ‘ది వారియర్’ కోసం ఆయన తొలిసారి ఖాకీ యూనిఫామ్ వేశాడు. రామ్ పోతినేని – లింగుస్వామి కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ కావడం… తెలుగు- తమిళ భాషల్లో తెరకెక్కుతుండటం… రామ్ పోలీస్ రోల్… ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయడం… ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ జూలై నెలలో విడుదలైంది. అందుకే సెంటిమెంట్ గా వారియర్ ను కూడా జులైలో రిలీజ్ చేస్తున్నారు. లింగుస్వామి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న కథతో ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘ది వారియర్’ను తీస్తున్నారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కుతోంది.

ప్రస్తుతం మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. విజయ్ మాస్టర్ నేతృత్వంలో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాం. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఇప్పటికే సాంగ్స్ కంపోజ్ చేసి ఇచ్చాడు.

తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ది వారియర్’లో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సెకెండ్ హీరోయిన్ గా అక్షరా గౌడ కనిపించనుంది

First Published:  27 March 2022 1:07 PM IST
Next Story