యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సెట్స్ పైకి
గతేడాది జరిగిన రోడ్డుడు ప్రమాదంలో టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి కొన్నాళ్లు పాటు పూర్తిగా రెస్ట్ తీసుకున్నాడు. ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ రిలీజ్‌కు ముందే ఆయన కోలుకున్నారు. ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు సాయితేజ్. వీడియోలో తనకి ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసిన సయ్యద్ అనే వ్యక్తితో పాటు తాను త్వరగా […]
గతేడాది జరిగిన రోడ్డుడు ప్రమాదంలో టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడి కొన్నాళ్లు పాటు పూర్తిగా రెస్ట్ తీసుకున్నాడు. ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ రిలీజ్‌కు ముందే ఆయన కోలుకున్నారు. ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు సాయితేజ్.
వీడియోలో తనకి ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసిన సయ్యద్ అనే వ్యక్తితో పాటు తాను త్వరగా కోలుకోవడానికి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే హాస్పిటల్లో తనకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్స్, పర్యవేక్షించిన వైద్య సిబ్బందికి, తన ఫ్యాన్స్‌కి, కుటుంబ సభ్యులకు థ్యాంక్స్ చెప్పాడు.
రేపట్నుంచి కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు సాయితేజ్. ఈ సినిమాకు సుకుమార్, బాపినీడు నిర్మాతలు. తన కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసిన వాళ్లకు కూడా థ్యాంక్స్ చెప్పాడు సాయితేజ్. ఫైనల్ గా తన ప్రాణాలు కాపాడిన హెల్మెట్ ను ముద్దాడాడు. బైక్ పై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా అందర్నీ కోరాడు ఈ మెగాహీరో.