Telugu Global
NEWS

పేదలకు వెల్ ఫేర్.. చంద్రబాబుకి ఫేర్ వెల్..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. చివరి రోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ ని విడుదల చేశారు సీఎం జగన్. సంక్షేమ పథకాల క్యాలెండర్‌, ఏపీలోని పేద వర్గాలకు వెల్‌ ఫేర్‌ క్యాలెండర్‌ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రం ఫేర్ వెల్ క్యాలెండర్ అంటూ చమత్కరించారు. చంద్రబాబుకి, ఆయనకు ఢంకా బజాయించే మీడియాకు ఏమాత్రం ఈ క్యాలెండర్ రుచించదని చెప్పారు, ఒకరకంగా వారిలో గుబులు పుట్టిస్తుందని అన్నారు. ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం […]

పేదలకు వెల్ ఫేర్.. చంద్రబాబుకి ఫేర్ వెల్..
X

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. చివరి రోజు సంక్షేమ పథకాలకు సంబంధించిన క్యాలెండర్ ని విడుదల చేశారు సీఎం జగన్. సంక్షేమ పథకాల క్యాలెండర్‌, ఏపీలోని పేద వర్గాలకు వెల్‌ ఫేర్‌ క్యాలెండర్‌ అని.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మాత్రం ఫేర్ వెల్ క్యాలెండర్ అంటూ చమత్కరించారు. చంద్రబాబుకి, ఆయనకు ఢంకా బజాయించే మీడియాకు ఏమాత్రం ఈ క్యాలెండర్ రుచించదని చెప్పారు, ఒకరకంగా వారిలో గుబులు పుట్టిస్తుందని అన్నారు.

ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టామని అన్నారు సీఎం జగన్. కరోనా లాంటి విపత్తు సమయంలోనూ సంక్షేమ పథకాల అమలు ఎక్కడా ఆగలేదని గుర్తు చేశారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్లే అని నమ్మి తమ ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పారు జగన్. సంక్షేమ పథకాల ఫలాలు.. ఎప్పుడు, ఏ నెలలో ఏ వర్గాల వారికి అందుతాయనే విషయంపై సందేహాలకు తావు లేకుండా ముందుకెళ్తున్నామని చెప్పారు. లబ్ధిదారులు ప్లాన్‌ చేసుకునేందుకు వీలుగా, పారదర్శకంగా, అవినీతి, వివక్షకు తావు లేకుండా ఏ నెలలో ఏ స్కీమ్‌ వస్తుందో చెబుతూ క్రమం తప్పకుండా అమలు చేస్తూ.. భరోసా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని చెప్పారు సీఎం జగన్. మంచి బడ్జెట్‌.. దేవుడి దయ.. ప్రజలందరి చల్లని దీవెనలు ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.

పెగాసస్ పై హౌస్ కమిటీ..
ఏపీలో పెగాస‌స్ సాఫ్ట్‌వేర్ వ్య‌వ‌హారంపై నిజానిజాలు తేల్చేందుకు హౌస్ కమిటీని నియమించారు అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం. ఈ క‌మిటీకి తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వం వ‌హిస్తారు. చంద్ర‌బాబు నాలుగేళ్ల క్రితం పెగాస‌స్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశార‌ని ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించిన సంగతి తెలిసిందే. త‌మ ఫోన్ల‌ను ట్యాప్ చేశారంటూ వైసీపీ నేత‌లు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ప్రస్తుత మమతా బెనర్జీ వ్యాఖ్యలు, గతంలో వైసీపీ నేతలు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చడంతో ఈ వ్య‌వ‌హారంపై ఏపీ అసెంబ్లీలో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌రిగింది. పెగాస‌స్ వ్య‌వ‌హారంపై నిగ్గు తేల్చాల్సిందేన‌ని స‌భ్యులంతా కోరడంతో అసెంబ్లీ సమావేశాల చివరి రోజు హౌస్ కమిటీని నియమించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

First Published:  25 March 2022 11:03 AM IST
Next Story