Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్ కోసం స్పెషల్ ఆర్టీసీ బస్సులు

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హైదరాబాద్ లో దాదాపు 90శాతం థియేటర్లలో రేపు ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది ఆర్ఆర్ఆర్ సినిమాను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా బస్సులు వేసింది తెలంగాణ ఆర్టీసీ. అంతేకాదు, సినిమా చూసేందుకు ఆర్ఆర్ఆర్ యూనిట్ […]

ఆర్ఆర్ఆర్ కోసం స్పెషల్ ఆర్టీసీ బస్సులు
X

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. హైదరాబాద్ లో దాదాపు 90శాతం థియేటర్లలో రేపు ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది

ఆర్ఆర్ఆర్ సినిమాను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా బస్సులు వేసింది తెలంగాణ ఆర్టీసీ. అంతేకాదు, సినిమా చూసేందుకు ఆర్ఆర్ఆర్ యూనిట్ కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని బస్సులు కేటాయించింది. తమ సినిమా కోసం బస్సులు కేటాయించిన ఆర్టీసీ ఛైర్మన్ సజ్జనార్ కు ఆర్ఆర్ఆర్ యూనిట్ అభినందనలు తెలిపింది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 5 గంటల నుంచే సినిమా షోలు ప్రారంభం అవుతున్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా దాదాపు అదే టైమ్ కు షోలు మొదలవుతాయి. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

First Published:  24 March 2022 11:04 AM IST
Next Story