Telugu Global
Cinema & Entertainment

ఇంటికి తిరిగొస్తున్న ప్రభాస్

రాధేశ్యామ్ ప్రచారం ముగిసిన వెంటనే స్పెయిన్ వెళ్లాడు ప్రభాస్. అదేదో రిలాక్స్ అవ్వడం కోసం వెళ్లలేదు. చిన్నపాటి సర్జరీ కోసం వెళ్లాడు. సలార్ సినిమా షూటింగ్ టైమ్ లో గాయపడ్డాడు ఈ హీరో. అది మందులతో తగ్గే గాయం కాదు. చిన్న ఆపరేషన్ చేయాలి. ఆ సర్జరీ కోసమే స్పెయిన్ వెళ్లాడు. అక్కడ పూర్తిగా కోలుకున్న ప్రభాస్, ఇప్పుడు హైదరాబాద్ కు వస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే 26వ తేదీన ప్రభాస్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే […]

ఇంటికి తిరిగొస్తున్న ప్రభాస్
X

రాధేశ్యామ్ ప్రచారం ముగిసిన వెంటనే స్పెయిన్ వెళ్లాడు ప్రభాస్. అదేదో రిలాక్స్ అవ్వడం కోసం వెళ్లలేదు. చిన్నపాటి సర్జరీ కోసం వెళ్లాడు. సలార్ సినిమా షూటింగ్ టైమ్ లో గాయపడ్డాడు ఈ హీరో. అది మందులతో తగ్గే గాయం కాదు. చిన్న ఆపరేషన్ చేయాలి. ఆ సర్జరీ కోసమే స్పెయిన్ వెళ్లాడు. అక్కడ పూర్తిగా కోలుకున్న ప్రభాస్, ఇప్పుడు హైదరాబాద్ కు వస్తున్నాడు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే 26వ తేదీన ప్రభాస్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ వచ్చిన వెంటనే అతడు మరో 2 వారాల పాటు రెస్ట్ తీసుకుంటాడు. ఆ తర్వాత మాత్రమే సినిమా సెట్స్ లో జాయిన్ అవుతాడు. అయితే రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వడంతో, ప్రభాస్ తన లైన్ ఆర్డర్ మారుస్తాడా లేక ప్రస్తుత షెడ్యూల్స్ నే కొనసాగిస్తాడా అనేది చూడాలి.

ఆదిపురుష్ సినిమాను పూర్తిచేశాడు ప్రభాస్. అది వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఇక సలార్ సినిమాతో పాటు ప్రాజెక్ట్-K షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాల్లో అతడు దేన్ని ముందుగా తెరపైకి తీసుకొస్తాడనేది ఆసక్తికరంగా మారింది

తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న లైనప్ నే యథాతథంగా ఫాలో అవ్వబోతున్నాడు. అతడి నుంచి ముందుగా ఆదిపురుష్ వస్తోంది. ఆ తర్వాత సలార్, ప్రాజెక్ట్-కె వస్తాయి. ఇవన్నీ రిలీజైన తర్వాత స్పిరిట్ సినిమా వస్తుంది.

First Published:  22 March 2022 3:41 PM IST
Next Story