Telugu Global
National

ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ వ్యూహాత్మక అడుగులు..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్, గోవా విషయంలో మాత్రం ముఖ్యమంత్రుల ఎంపిక అధిష్టానానికి తలకు మించిన భారంగా మారింది. ఉత్తరాఖండ్ లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన పుష్కర్ సింగ్ ధామి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అక్కడ శాసన మండలి కూడా లేదు. దీంతో ఆయనకు సీఎం సీటు ఇవ్వరని అనుకున్నారంతా. రేసులో మరో నలుగురు ముందుకొస్తున్నా.. అధినాయకత్వం మాత్రం పుష్కర్ సింగ్ […]

ముఖ్యమంత్రుల ఎంపికలో బీజేపీ వ్యూహాత్మక అడుగులు..
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్, గోవా విషయంలో మాత్రం ముఖ్యమంత్రుల ఎంపిక అధిష్టానానికి తలకు మించిన భారంగా మారింది. ఉత్తరాఖండ్ లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన పుష్కర్ సింగ్ ధామి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అక్కడ శాసన మండలి కూడా లేదు. దీంతో ఆయనకు సీఎం సీటు ఇవ్వరని అనుకున్నారంతా. రేసులో మరో నలుగురు ముందుకొస్తున్నా.. అధినాయకత్వం మాత్రం పుష్కర్ సింగ్ ధామికే పగ్గాలప్పగించింది. ఉత్తరాఖండ్ లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన ఆయన సేవలకు గుర్తింపునిచ్చింది.

గోవాలో కూడా ముఖ్యమంత్రి మారిపోతారని అనుకున్నా.. అక్కడా మాజీ సీఎంకే పెద్దపీట వేశారు బీజేపీ నేతలు. ప్రమోద్‌ సావంత్‌ కే పగ్గాలు అప్పగించారు. మాజీ మంత్రి విశ్వజిత్‌ రాణే చివరి వరకూ పోటీలో ఉన్నా.. ఆయన్ను పక్కనపెట్టారు. మార్పులేవీ లేకుండానే ప్రమోద్ నే సీఎంగా కొనసాగించబోతున్నారు. 40 స్థానాలున్న గోవాలో బీజేపీ 20 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీకే మద్దతు పలికారు.

మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్‌ సింగ్‌ ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. అంటే యూపీ సహా ఎక్కడా బీజేపీ మార్పు కోరుకోలేదు. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కొన్న ముఖ్యమంత్రులకే పగ్గాలు అప్పగించింది. ఉత్తరాఖండ్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా పుష్కర్ సింగ్ ధామికి అవకాశమిచ్చింది.

First Published:  21 March 2022 10:39 PM
Next Story