Telugu Global
NEWS

జిల్లాల పునర్విభజనపై 11వేల అభ్యర్థనలు.. మార్పులుంటాయా..?

ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాలనుంచి పాలన మొదలు పెట్టాలనుకుంటోంది. అంటే సరిగ్గా 10రోజులే సమయం ఉంది. ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దుల్లో మార్పులుండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాల లిస్ట్ బయటపెట్టింది. మొత్తం 11వేల అభ్యంతరాలొచ్చాయని తెలిపింది. మరి వీటిలో ఎన్నిటిని పరిగణలోకి తీసుకుంటారనేది తేలాల్సిన విషయం. ఆ మూడు జిల్లాలనుంచి అత్యథికంగా.. మా జిల్లా పేరు మార్చండి, మమ్మల్ని ఫలానా జిల్లాలో […]

జిల్లాల పునర్విభజనపై 11వేల అభ్యర్థనలు.. మార్పులుంటాయా..?
X

ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఏప్రిల్ 2నుంచి కొత్త జిల్లాలనుంచి పాలన మొదలు పెట్టాలనుకుంటోంది. అంటే సరిగ్గా 10రోజులే సమయం ఉంది. ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దుల్లో మార్పులుండే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు అభ్యంతరాల లిస్ట్ బయటపెట్టింది. మొత్తం 11వేల అభ్యంతరాలొచ్చాయని తెలిపింది. మరి వీటిలో ఎన్నిటిని పరిగణలోకి తీసుకుంటారనేది తేలాల్సిన విషయం.

ఆ మూడు జిల్లాలనుంచి అత్యథికంగా..
మా జిల్లా పేరు మార్చండి, మమ్మల్ని ఫలానా జిల్లాలో ఉంచండి, అసలు మాకు ప్రత్యేక జిల్లా ఇవ్వండి.. ఇలాంటి అభ్యర్థనలు మొత్తం 11వేలకు పైగా వచ్చాయి. అమలాపురం, నరసరావుపేట, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఇలాంటి డిమాండ్లు ఎక్కువగా వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా విభజన చేయడం వల్ల కొత్తగా తిరుపతి కేంద్రంగా ఏర్పడే బాలాజీ జిల్లాలోకి వెళ్లిపోతుంది. అయితే అదే తిరుపతి లోక్ సభ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి నియోజకవర్గాన్ని మాత్రం నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తున్నారు. ఇక్కడ పార్లమెంట్ పరిధికి కాస్త మినహాయింపునిచ్చారు. ఇప్పుడు గూడూరు వాసులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. సర్వేపల్లికి ఇచ్చిన మినహాయింపు తమకు కూడా కావాలంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

దూరం పెరుగుతోంది..
సహజంగా జిల్లాల సంఖ్య పెరిగితే.. జిల్లా కేంద్రం అన్ని ప్రాంతాలకు దగ్గరయ్యే అవకాశముంటుంది. కానీ కొన్నిచోట్ల దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. రంపచోడవరం నియోజకవర్గాన్నిపాడేరు కేంద్రంగా ఏర్పాటుచేసే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలపడం వల్ల జిల్లాకేంద్రం వారికి బాగా దూరమవుతుంది. అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం కాకినాడకు సమీపంలో ఉండటంతో దాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అక్కడి ప్రజల డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలు తమను నెల్లూరులో కలపొద్దని, ప్రకాశంలోనే ఉంచాలని కోరుతున్నారు.

జిల్లా కేంద్రాల విషయంలో కూడా చాలా చోట్ల అభ్యంతరాలున్నాయి. పుట్టపర్తి బదులు హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, రాయచోటి బదులు రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని సహేతుకమైన కారణాలున్నాయి. మరి ప్రభుత్వం 11వేల అభ్యంతరాల్లో ఎన్నిటిని పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.

First Published:  22 March 2022 3:08 AM IST
Next Story