Telugu Global
Cinema & Entertainment

కాస్త ముందుగానే దసరా వచ్చేసింది

టాలీవుడ్ కు కాస్త ముందుగానే దసరా వచ్చేసింది. నాని తీసుకొచ్చిన దసరా ఇది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు నాని. అంతలోనే ఫస్ట్ లుక్ తో పాటు, ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది దసరా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న నాని మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ […]

కాస్త ముందుగానే దసరా వచ్చేసింది
X

టాలీవుడ్ కు కాస్త ముందుగానే దసరా వచ్చేసింది. నాని తీసుకొచ్చిన దసరా ఇది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశాడు నాని. అంతలోనే ఫస్ట్ లుక్ తో పాటు, ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతోంది దసరా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న నాని మొదటి పాన్ ఇండియా చిత్రం ఇదే. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌లో దసరాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ హీరోయిన్.

దసరా షూటింగ్ ఈమధ్యే మొదలైంది. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు స్పార్క్ ఆఫ్ దసరా పేరుతో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో లుంగీ కట్టుకున్న నాని.. పక్కనే నిప్పు ఉండటం దాంట్లో చెయ్యి పెట్టి బీడీ వెలిగించడం హైలెట్. బీడీ వెలిగించి సింగరేణి మైన్స్ ద్వారా తన గ్యాంగ్‌తో కలిసి నడుస్తూ స్టైల్‌ గా ఎంట్రీ ఇచ్చాడు. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్ కు మంచి లుక్ తీసుకొచ్చింది.

గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌ దగ్గర ఉన్న ఒక గ్రామంలో జరిగే కథ ఇది. నాని ఇందులో మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు.

First Published:  20 March 2022 12:46 PM IST
Next Story