Telugu Global
National

భారత్ లోనే మొట్టమొదటి ఇ-అసెంబ్లీ..

ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో వెనకబడి ఉంటాయనేది గతం. టెక్నాలజీలో పోటీ పడుతూ, సాఫ్ట్ వేర్ హబ్ లు గా పేరు తెచ్చుకున్న ఇతర రాష్ట్రాలకంటే ఈశాన్య రాష్ట్రాలు ఓ అడుగు ముందే ఉన్నాయనడానికి నాగాలాండ్ ఓ ఉదాహరణగా నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి ఇ-అసెంబ్లీ గా నాగాలాండ్ చరిత్ర సృష్టించింది. పేపర్ లెస్ అసెంబ్లీ సమావేశాలకు తొలి వేదికగా నిలిచింది. నాగాలాండ్ లో యునైటెడ్ డెమొక్రటికి అలయన్స్ అధికారంలో ఉంది. నేషనలిస్ట్ డెమొక్రాటిక్ పీపుల్స్ పార్టీ తరపున నిపురియో ముఖ్యమంత్రిగా […]

భారత్ లోనే మొట్టమొదటి ఇ-అసెంబ్లీ..
X

ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో వెనకబడి ఉంటాయనేది గతం. టెక్నాలజీలో పోటీ పడుతూ, సాఫ్ట్ వేర్ హబ్ లు గా పేరు తెచ్చుకున్న ఇతర రాష్ట్రాలకంటే ఈశాన్య రాష్ట్రాలు ఓ అడుగు ముందే ఉన్నాయనడానికి నాగాలాండ్ ఓ ఉదాహరణగా నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి ఇ-అసెంబ్లీ గా నాగాలాండ్ చరిత్ర సృష్టించింది. పేపర్ లెస్ అసెంబ్లీ సమావేశాలకు తొలి వేదికగా నిలిచింది.

నాగాలాండ్ లో యునైటెడ్ డెమొక్రటికి అలయన్స్ అధికారంలో ఉంది. నేషనలిస్ట్ డెమొక్రాటిక్ పీపుల్స్ పార్టీ తరపున నిపురియో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రం అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాగాలాండ్ లో ఇ-అసెంబ్లీ రూపొందింది. నాగాలాండ్ అసెంబ్లీలోని 60మంది ఎమ్మెల్యేల సీట్ల ముందు టాబ్లెట్ పీసీ, లేదా ఇ-బుక్ అమర్చారు. వాటిలో నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్(NeVA) అనే ప్రోగ్రామ్ ని పొందు పరిచారు. ఈ ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ఇలా మొదలు కావడంతో నాగాలాండ్, భారత్ లోనే తొట్టతొలి ఇ-అసెంబ్లీగా రికార్డు సృష్టించింది.

త్వరలో హిమాచల్ ప్రదేశ్ లో కూడా నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్ ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో పేపర్ లెస్ బడ్జెట్, పేపర్ లెస్ బడ్జెట్ సెషన్స్ అనే ప్రయోగాలు జరిగాయి. కానీ తొలిసారిగా నాగాలాండ్ లో అసలు పేపర్లే లేకుండా పూర్తిస్థాయి అసెంబ్లీ మొదలైంది. అన్నిచోట్లా ఇదే అమలులోకి వస్తే.. విపక్షాల ఎమ్మెల్యేలకు పేపర్లు చించేయడం, పోడియంపైకి విసిరేయడం లాంటి నిరసనలకు అవకాశం ఉండకపోవచ్చు.

First Published:  19 March 2022 9:57 PM GMT
Next Story