Telugu Global
International

పేపర్లు లేవు, ప్రింటర్లు లేవు, పరీక్షలు క్యాన్సిల్..

రెండేళ్లుగా కరోనా.. అకడమిక్ పరీక్షలని కాటు వేసింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. కానీ ఈ ఏడాది పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి, విద్యార్థులు కూడా ర్యాంకులు, మార్కులకోసం కసరత్తులు చేస్తున్నారు, కష్టపడి చదువుతున్నారు. ఈ టైమ్ లో ఉన్నట్టుండి శ్రీలంక ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది విద్యార్థులెవరికీ పరీక్షలు లేవని చెప్పేసింది, పై తరగతులకు అందర్నీ ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అసలు శ్రీలంకలో ఏం […]

పేపర్లు లేవు, ప్రింటర్లు లేవు, పరీక్షలు క్యాన్సిల్..
X

రెండేళ్లుగా కరోనా.. అకడమిక్ పరీక్షలని కాటు వేసింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ అయ్యారు. కానీ ఈ ఏడాది పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. పరీక్షలకు షెడ్యూళ్లు విడుదలయ్యాయి, విద్యార్థులు కూడా ర్యాంకులు, మార్కులకోసం కసరత్తులు చేస్తున్నారు, కష్టపడి చదువుతున్నారు. ఈ టైమ్ లో ఉన్నట్టుండి శ్రీలంక ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది విద్యార్థులెవరికీ పరీక్షలు లేవని చెప్పేసింది, పై తరగతులకు అందర్నీ ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించింది. అసలు శ్రీలంకలో ఏం జరిగింది..?

గతంలో ఎప్పుడూ లేనంతగా శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ఈ స్థాయిలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం రాలేదు. పెట్రోల్, డీజిల్ సహా.. నిత్యావసరాల ధరలు కూడా ఆకాశంలో కూర్చున్నాయి. ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు. పేదలు ఆకలితో అల్లాడిపోతున్నారు, మధ్యతరగతి ప్రజలు కనీస అవసరాలకు వస్తువులు కొనలేక విలవిల్లాడిపోతున్నారు. ప్రభుత్వం అందించే రేషన్ సరకుల దుకాణాలముందు కిలోమీటర్ల పొడవున క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పాలు, కూరగాయలు, బిస్కెట్లు.. ఇలా అన్నిటి అమ్మకాలపై నియంత్రణ ఉంది. ఒక్కొకరికి ఒకటే పాల ప్యాకెట్, ఒకరికి ఒకటే బిస్కెస్ ప్యాకెట్.. షాపుల నిర్వాహకులు కూడా ఇలాగే అమ్మాల్సి వస్తోంది. రోజులో కనీసం 10 గంటలసేపు కరెంటు ఉండదు. పరిశ్రమలు ఆగిపోయాయి, పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశానికంటడంతో ఇతరత్రా వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి. దీనికి పరాకాష్ట ఇప్పుడు పరీక్షలు క్యాన్సిల్ కావడం. కేవలం పేపర్లు లేవు అనే కారణంగా శ్రీలంకలో పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి.

శ్రీలంకలో వైట్ పేపర్స్ కి కొరత వచ్చింది. దిగుమతి చేసుకునేంత స్థోమత ఇప్పుడా దేశానికి లేదు. పోనీ పేపర్లు ఉన్నా, ప్రింటర్లలో ఇంకు ఆరిపోయింది. కనీసం ఇంకు బాటిళ్లు కొనేందుకు కూడా ఆ దేశం వద్ద డబ్బుల్లేవు. అప్పులు పెరిగిపోయాయి. రుణమాఫీకోసం చైనాను ప్రాధేయపడినా పని జరగలేదు. దీంతో ఇతర దేశాల ఆర్థిక సాయంపైనే శ్రీలంక ఆధారపడింది. ఈ సమయంలో అనవసర ఖర్చుని బాగా తగ్గించుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. అందులో భాగంగా విద్యార్థులకు పరీక్షలు క్యాన్సిల్ చేసింది. శ్రీలంకలో మొత్తం 45లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరంతా ప్రభుత్వ నిర్ణయంతో ప్రభావితం కావాల్సి వస్తోంది. ముందు ముందు శ్రీలంక పరిస్థితి మరింత దుర్భరంగా మారే అవకాశముంది.

First Published:  20 March 2022 3:43 AM IST
Next Story