ఆర్ఆర్ఆర్ టికెట్ల హంగామా మొదలు
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి టికెట్ల హంగామా మొదలైంది. తెలంగాణ, ఏపీలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు రావడంతో.. ఇవాళ్టి నుంచి తెలంగాణలో బుకింగ్ మొదలైంది. బుక్ మై షోలో ప్రసాద్స్ థియేటర్లకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభించిన 5 నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. రేపట్నుంచి మరిన్ని థియేటర్లను యాడ్ చేయబోతున్నారు. ఇక టికెట్ ధరల విషయానికొస్తే.. ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టికెట్ పై 50 రూపాయల నుంచి 75 […]
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇవాళ్టి నుంచి టికెట్ల హంగామా మొదలైంది. తెలంగాణ, ఏపీలో ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు రావడంతో.. ఇవాళ్టి నుంచి తెలంగాణలో బుకింగ్ మొదలైంది. బుక్ మై షోలో ప్రసాద్స్ థియేటర్లకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభించిన 5 నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. రేపట్నుంచి మరిన్ని థియేటర్లను యాడ్ చేయబోతున్నారు.
ఇక టికెట్ ధరల విషయానికొస్తే.. ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం టికెట్ పై 50 రూపాయల నుంచి 75 రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈరోజు తెలంగాణ నుంచి కూడా ప్రత్యేకజీవో విడుదలైంది. టికెట్ రేట్లను 100 రూపాయల వరకు పెంచుకునేలా జీవో విడుదలైంది.
తెలంగాణ విషయానికొస్తే.. మొదటి 3 రోజులు 100 రూపాయలు, ఆ తర్వాత వారం రోజుల పాటు 50 రూపాయలు పెంచుకునేలా జీవో రిలీజ్ అయింది. దీంతో పాటు అదనంగా 5వ ఆటను కూడా వేసుకునే వెసులుబాటు కల్పించారు. తాజా జీవోతో తెలంగాణలో ఆర్ఆర్ఆర్ టికెట్ ధర గరిష్టంగా 450 రూపాయలకు చేరుకుంది. అదనపు ట్యాక్సులు కూడా కలుపుకుంటే కొన్ని థియేటర్లలో టికెట్ రేటు 500 రూపాయలకు కూడా చేరుకునే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్ లో ప్రత్యేక ప్రీమియర్స్ కు కూడా అవకాశం కల్పించారు. కూకట్ పల్లిలోని 3 థియేటర్లతో పాటు మరో 2 థియేటర్లలో.. మొత్తంగా 5 థియేటర్లలో ఉదయం 4 గంటలకే స్పెషల్ షో వేయబోతున్నారు. ఈ షోకు టికెట్ ధరను 5వేల రూపాయలుగా నిర్ణయించారు.