మరో రీమేక్ పై కన్నేసిన చిరంజీవి?
చిరంజీవికి రీమేక్స్ కొత్తకాదు. కెరీర్ లో చాలా రీమేక్స్ చేశారు. రీఎంట్రీ కూడా రీమేక్ తోనే ఇచ్చారు. ప్రస్తుతం ఓ రీమేక్ సెట్స్ పై ఉంది కూడా. ఇప్పుడీ హీరో మరో రీమేక్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మలయాళంలో రీసెంట గా వచ్చిన బ్రో డాడీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట చిరు. మలయాళంలో మోహన్ లాల్, పృధ్వీరాజ్ కుమార్ హీరోలుగా తెరకెక్కింది బ్రో డాడీ. ఈ సినిమాలో నటించడమే కాకుండా స్వయంగా […]
చిరంజీవికి రీమేక్స్ కొత్తకాదు. కెరీర్ లో చాలా రీమేక్స్ చేశారు. రీఎంట్రీ కూడా రీమేక్ తోనే ఇచ్చారు. ప్రస్తుతం ఓ రీమేక్ సెట్స్ పై ఉంది కూడా. ఇప్పుడీ హీరో మరో రీమేక్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మలయాళంలో రీసెంట గా వచ్చిన బ్రో డాడీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట చిరు.
మలయాళంలో మోహన్ లాల్, పృధ్వీరాజ్ కుమార్ హీరోలుగా తెరకెక్కింది బ్రో డాడీ. ఈ సినిమాలో నటించడమే కాకుండా స్వయంగా డైరక్ట్ చేశారు పృధ్వీరాజ్. కంప్లీట్ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పుడీ ప్రాజెక్టును రీమేక్ చేయాలని చిరంజీవి భావిస్తున్నారట.
రీసెంట్ గా చిరంజీవి-మారుతి కాంబోలో ఓ సినిమా రాబోతోందంటూ ప్రచారం జరిగింది. అదే కనుక నిజమైతే.. ఈ రీమేక్ ప్రాజెక్టు మారుతి చేతికి వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు సెట్ అయినప్పటికీ సెట్స్ పైకి రావడానికి చాలా టైమ్ పట్టేలా ఉంది.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు చిరు. మరోవైపు భోళాశంకర్ సినిమా సెట్స్ పై ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత బాబి దర్శకత్వంలో ఒకటి, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇంకో సినిమా చేయాల్సి ఉంది. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత బ్రో డాడీ రీమేక్ సెట్స్ పైకి వస్తుంది.