Telugu Global
Cinema & Entertainment

నయన్ బాయ్ ఫ్రెండ్ తో అజిత్ సినిమా

నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ కు కోలీవుడ్ లో మంచి పేరుంది. యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, డ్రామా అయినా బాగా పండించగలడనే ఇమేజ్ ఉంది. తన ప్రతి సినిమాతో అంతోఇంతో ఆడియన్స్ ను, కోలీవుడ్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడీ డైరక్టర్ ఓ బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఏకంగా హీరో అజిత్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అవును.. అజిత్, విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. […]

నయన్ బాయ్ ఫ్రెండ్ తో అజిత్ సినిమా
X

నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ కు కోలీవుడ్ లో మంచి పేరుంది. యాక్షన్ అయినా, రొమాన్స్ అయినా, డ్రామా అయినా బాగా పండించగలడనే ఇమేజ్ ఉంది. తన ప్రతి సినిమాతో అంతోఇంతో ఆడియన్స్ ను, కోలీవుడ్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడీ డైరక్టర్ ఓ బంపర్ ఆఫర్ అందుకున్నాడు. ఏకంగా హీరో అజిత్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు.

అవును.. అజిత్, విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు.

మొన్నటివరకు దర్శకుడు శివతో వరుసపెట్టి సినిమాలు చేశాడు అజిత్. రీసెంట్ గా వినోద్ దర్శకత్వంలో వలిమై సినిమా చేశాడు. కానీ అది ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది. ఇప్పుడు విఘ్నేష్ శివన్ కు అవకాశం ఇచ్చాడు వినోద్. ఎప్పుడూ యాక్షన్ సినిమాల్ని ఇష్టపడే అజిత్, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఏ జానర్ లో సినిమా చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం విఘ్నేష్ శివన్ ఓ ట్రయాంగులర్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. విజయ్ సేతుపతి హీరోగా నయనతార-సమంత హీరోయిన్లుగా ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ రిలీజైన తర్వాత అజిత్ సినిమాపై పూర్తిగా దృష్టిపెడతాడు ఈ దర్శకుడు.

First Published:  19 March 2022 3:38 PM IST
Next Story