అది సాంస్కృతిక తీవ్రవాదమే " మధ్యప్రదేశ్ మంత్రి
దీపావళి రోజు టపాకాయలు కాల్చొద్దని చెప్పడం, హోలీ రోజు రంగులు చల్లుకోడానికి నీళ్లను వాడొద్దని చెప్పడం సాంస్కృతిక తీవ్రవాదమేనంటున్నారు మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్. హిందువుల పండగలపై జరుగుతున్న దాడిగా దీన్ని అభివర్ణించారు. ‘సేవ్ వాటర్ ఆన్ హోలీ డే’.. అంటూ సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం హిందువుల పండగలు జరుపుకునే రోజుల్లోనే ఇలాంటివన్నీ గుర్తొస్తాయా అని ప్రశ్నించారు. నీటిని పొదుపు చేయాలంటే కార్లు కడగొద్దు.. నీటి వృథాను అరికట్టడం మంచిదేనని […]
దీపావళి రోజు టపాకాయలు కాల్చొద్దని చెప్పడం, హోలీ రోజు రంగులు చల్లుకోడానికి నీళ్లను వాడొద్దని చెప్పడం సాంస్కృతిక తీవ్రవాదమేనంటున్నారు మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్. హిందువుల పండగలపై జరుగుతున్న దాడిగా దీన్ని అభివర్ణించారు. ‘సేవ్ వాటర్ ఆన్ హోలీ డే’.. అంటూ సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం హిందువుల పండగలు జరుపుకునే రోజుల్లోనే ఇలాంటివన్నీ గుర్తొస్తాయా అని ప్రశ్నించారు.
నీటిని పొదుపు చేయాలంటే కార్లు కడగొద్దు..
నీటి వృథాను అరికట్టడం మంచిదేనని అదే సమయంలో హిందువుల పండగల సమయంలోనే ఇలాంటి స్లోగన్లు బయటకు రావడం మాత్రం సరికాదని అన్నారు విశ్వాస్ సారంగ్. నీటిని పొదుపుగా వాడాలనే ఉద్యమాలు ఏడాది పొడవునా ఎందుకు జరగడంలేదని ప్రశ్నించారు. ప్రజలు తమ కార్లను శుభ్రం చేయడానికి నీటిని వృథా చేస్తుంటారని, హోలీరోజు రంగులు చల్లుకోడానికి వాడే నీరు దానిలో కనీసం 2 శాతం కూడా ఉండదని చెప్పారు. సేవ్ వాటర్ ఆనే హోలీడే అని అనడం.. కల్చరల్ టెర్రరిజం అవుతుందని చెప్పారు.
పిడకలే మేలు..
హోలీ రోజు కామదహనం కార్యక్రమంలో కొయ్యలు, చెక్క ముక్కలు వాడొద్దంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. చెక్కల బదులు ఆవుపేడను వాడాలంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు సూచించారు. కామహదనం కోసం చెట్లను నరకొద్దని, వృక్ష సంపదను నాశనం చేయొద్దని పిలుపునిచ్చారు. పర్యావరణానికి మేలు చేసేలా ఆవుపేడతో చేసిన పిడకలను వినియోగించాలని చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్.