Telugu Global
Cinema & Entertainment

గని ట్రయిలర్ రివ్యూ

ఎట్టకేలకు గని సినిమా విడుదలకు సిద్ధమైంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఈరోజు రిలీజైన ఈ ట్రయిలర్ లో సినిమా కథ ఏంటి, ఎలా ఉండబోతోందనే విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు యూనిట్. హీరోకు బాక్సింగ్ అంటే ఇష్టం. కాని కొన్ని కారణాల వల్ల బాక్సింగ్ కు దూరంగా ఉండమని హీరో తల్లి, కొడుకు నుంచి మాట తీసుకుంటుంది. అయితే […]

గని ట్రయిలర్ రివ్యూ
X

ఎట్టకేలకు గని సినిమా విడుదలకు సిద్ధమైంది. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించిన ఈ సినిమాకు సంబంధించి ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఈరోజు రిలీజైన ఈ ట్రయిలర్ లో సినిమా కథ ఏంటి, ఎలా ఉండబోతోందనే విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు యూనిట్.

హీరోకు బాక్సింగ్ అంటే ఇష్టం. కాని కొన్ని కారణాల వల్ల బాక్సింగ్ కు దూరంగా ఉండమని హీరో తల్లి, కొడుకు నుంచి మాట తీసుకుంటుంది. అయితే హీరో మాత్రం తల్లికి తెలియకుండా సీక్రెట్ గా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఎలాగైనా జాతీయ ఛాంపియన్ షిప్ కొట్టి, అప్పుడు తల్లికి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ ఈలోగానే పరిస్థితులు మారిపోతాయి. ఓవైపు బాక్సింగ్ అసొసియేషన్ లో రాజకీయాలు, మరోవైపు హీరో కుటుంబంలో ఆటుపోట్లు, ఇంకోవైపు కాలేజ్ లైఫ్, ప్రేమ.. ఇలా అన్ని పార్శ్వాలు కవర్ చేస్తూ గని సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది.

ట్రయిలర్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. తమన్న ఇందులో ఐటెంసాంగ్ చేసింది. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా పరిచయమౌతుంది.

First Published:  17 March 2022 11:59 AM IST
Next Story