ధమాకా షూటింగ్ అప్ డేట్స్
ఇటు రామారావు ఆన్ డ్యూటీ, అటు ధమాకా సినిమాల్ని ఏకకాలంలో పూర్తి చేస్తున్నాడు హీరో రవితేజ. ప్రస్తుతం ఈ హీరో ధమాకా సినిమా సెట్స్ లో ఉన్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కు […]
ఇటు రామారావు ఆన్ డ్యూటీ, అటు ధమాకా సినిమాల్ని ఏకకాలంలో పూర్తి చేస్తున్నాడు హీరో రవితేజ. ప్రస్తుతం ఈ హీరో ధమాకా సినిమా సెట్స్ లో ఉన్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.
ఇటీవల హైదరాబాద్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. కాగా, పాటల చిత్రీకరణ కోసం టీమ్ స్పెయిన్ వెళ్లింది. ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ పాటను ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్లో చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్ పాటను చిత్రీకరించడానికి ఇది ఓ అద్భుతమైన ప్రదేశం.
‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో ధమాకా వస్తుంది. ఇందులో ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత.