నాకు నేనే పోటీ " బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన `అఖండ` చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. అఖండ వంద రోజుల కృతజ్ఞత సభ కర్నూలు నగరంలోని ఎస్‌టి.బి.సి. కాలేజ్ లో ఘనంగా జరిగింది. ఆనందోత్సాహాలతో కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోనీ, విజయవాడ, ఢిల్లీ నుంచి సైతం పెద్ద ఎత్తున అభిమానులు […]
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' చిత్రం 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని సాధించడం బాలకృష్ణలోని ప్రత్యేకతగా అభిమానులు తెలియజేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు.
అఖండ వంద రోజుల కృతజ్ఞత సభ కర్నూలు నగరంలోని ఎస్‌టి.బి.సి. కాలేజ్ లో ఘనంగా జరిగింది. ఆనందోత్సాహాలతో కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోనీ, విజయవాడ, ఢిల్లీ నుంచి సైతం పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చిన్నపిల్లల నుంచి మహిళలు, పెద్దలు సైతం 'జైబాలయ్య' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాలయ్య ఉత్సాహంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు..
– నా సినిమాలే నాకు పోటీ. సింహకు పోటీ లెజెండ్. లెజెండ్‌కు పోటీ అఖండ. ముందు ముందు మరిన్ని సినిమాలు మా నుంచి తయారువుతాయి. సినిమాను పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాలను గతంలో అడిగాం. నాది, బోయపాటి కాంబినేషన్ చిన్న కుటీర పరిశ్రమ లాంటిది. మేం సినిమాలు తీస్తూనే ఉంటాం. కట్టె, కొట్టె, తెచ్చ టైపులో మాత్రమే కథ అనుకుంటాం. సినిమా రెడీ అయిపోతుంది.
– ఇక నటన అంటే నవ్వు, ఏడవడం కాదు. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అలా చేయించడంలో రచయితలు, దర్శకులు పని తనం వుంటుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అద్భుతంగా ఇచ్చారు. ప్రేక్షకుల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్ళాడు. శివతాండవం చేసేటప్పుడు థమన్ ఇచ్చిన ధ్వనితో అమెరికాలోని థియేటర్ల స్పీకర్‌లు బద్దలై సునామి సృష్టించాయి.
– కరోనా టైంలో చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేశాం. ఎప్పుడు కరోనా వచ్చిందనేది కూడా మర్చిపోయేలా చేయగలిగాం. అభిమానులు సినిమాలేకాదు. నాన్నగారి నుంచి సేవా కార్యక్రమాలను కూడా పుణికిపుచ్చుకుని చేస్తున్నారు. అందుకు గర్వంగా వుంది.