స్పెయిన్ లో డ్యూటీ చేస్తున్న రామారావు
రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ’ కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. తాజాగా, రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్‌లో దిగింది. ఇప్పటికే ఆ దేశంలో పాటల చిత్రీకరణ ప్రారంభమైంది. దీంతో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇటీవలే, చిత్ర నిర్మాతలు ఈ […]
రవితేజ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ’ కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తిచేసుకుంది. తాజాగా, రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్‌లో దిగింది. ఇప్పటికే ఆ దేశంలో పాటల చిత్రీకరణ ప్రారంభమైంది. దీంతో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
ఇటీవలే, చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేశారు, సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటల్ని, ఒక్కొక్కటిగా త్వరలోనే విడుదల చేయబోతున్నారు.
యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఓ కీలక పాత్ర లో కనిపించనున్నారు. రవితేజ ఈ సినిమాలో ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నాడు.