ఈ బాలీవుడ్ హీరోయిన్ ను అరెస్ట్ చేస్తారా?
“హీరోయిన్ సోనాక్షి సిన్హాపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు.” 2 రోజులుగా బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అయిన న్యూస్ ఇది. దీనిపై సోనాక్షి స్పందించింది. తనపై వస్తున్న వార్తల్ని కొట్టి పారేసింది. కొంతమంది కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటోంది సోనాక్షి. “నాపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఓ వ్యక్తి నన్ను ఈ విధంగా బాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. పబ్లిసిటీ […]
“హీరోయిన్ సోనాక్షి సిన్హాపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు.” 2 రోజులుగా బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ అయిన న్యూస్ ఇది. దీనిపై సోనాక్షి స్పందించింది. తనపై వస్తున్న వార్తల్ని కొట్టి పారేసింది. కొంతమంది కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అంటోంది సోనాక్షి.
“నాపై నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయినట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఓ వ్యక్తి నన్ను ఈ విధంగా బాధించడానికి ప్రయత్నిస్తున్నాడు. పబ్లిసిటీ కోసం ఆ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడు. పనిలోపనిగా బ్లాక్ మెయిల్ చేసి నా నుంచి డబ్బు కాజేసే ప్రయత్నం ఇది. దయచేసి మీడియా దీన్ని పట్టించుకోవద్దు.”
కొన్నేళ్లుగా తను సంపాదించుకున్న స్టార్ డమ్, ఇమేజ్ ను నాశనం చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని.. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి అతడు చేస్తున్న ప్రయత్నాల్లో మీడియా భాగం అవ్వొద్దని సోనాక్షి కోరుతోంది. తన లాయర్లు ఈ వ్యవహారాన్ని హ్యాండిల్ చేస్తారని, విషయం ఇప్పటికే కోర్టుకు చేరిందనే విషయాన్ని కూడా ఆమె బయటపెట్టింది.
తను అరెస్ట్ అవ్వలేదని, కేవలం హౌజ్ అరెస్ట్ లో మాత్రమే ఉన్నానంటూ సరదాగా ఓ ఫొటోను షేర్ చేసింది సోనాక్షి. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే 2 సినిమాలు పూర్తి చేసింది ఈ ముద్దుగుమ్మ. వీటితో పాటు ఓటీటీలోకి కూడా ఎంటరైంది.