Telugu Global
Cinema & Entertainment

సమంత కూడా మందు కొట్టమంటోంది..!

హీరోలే కాదు, హీరోయిన్లు కూడా లిక్కర్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. కోరినంత డబ్బు ఇస్తుండడంతో మద్యం బ్రాండ్ అనే మొహమాటం కూడా లేకుండా ప్రమోషన్ ఇస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సమంత కూడా చేరిపోయింది. హీరోయిన్లలో అత్యథిక బ్రాండ్స్ కలిగిన హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సమంత, తాజాగా ఓ లిక్కర్ బ్రాండ్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి సమంతపై ఫొటోషూట్ కూడా నిర్వహించారు. ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. సమంత చేసిన ఈ […]

సమంత కూడా మందు కొట్టమంటోంది..!
X

హీరోలే కాదు, హీరోయిన్లు కూడా లిక్కర్ బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. కోరినంత డబ్బు ఇస్తుండడంతో మద్యం బ్రాండ్ అనే మొహమాటం కూడా లేకుండా ప్రమోషన్ ఇస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సమంత కూడా చేరిపోయింది.

హీరోయిన్లలో అత్యథిక బ్రాండ్స్ కలిగిన హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సమంత, తాజాగా ఓ లిక్కర్ బ్రాండ్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి సమంతపై ఫొటోషూట్ కూడా నిర్వహించారు. ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. సమంత చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. సామాజిక బాధ్యతతో వ్యవహరించే సమంత, ఇలా డబ్బు కోసం లిక్కర్ బ్రాండ్ కు ప్రచారం చేయడం ఏం బాగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొన్నటికిమొన్న హీరోయిన్ పూజాహెగ్డే, ఓ లిక్కర్ బ్రాండ్ కు ప్రచారం కల్పించింది. ఏకంగా తనే అన్నీ మిక్స్ చేస్తూ ఓ కాక్ టైల్ తయారుచేసి చూపించింది. ఆ గ్లాస్ ను తన చేత్తో పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది. అలియాభట్, కృతి సనన్, కత్రినా లాంటి హీరోయిన్లు కూడా లిక్కర్ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఇప్పుడు సమంత కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది.

First Published:  9 March 2022 4:52 PM IST
Next Story